నాగచైతన్య, వెంకటేష్ మూవీ మొదలయ్యేది ఎప్పుడంటే ?

  • July 3, 2018 / 02:13 PM IST

కొన్ని కాంబినేషన్లు చాలా క్రేజీగా ఉంటాయి. అటువంటి వాటిలో నాగచైతన్య, వెంకటేష్ మూవీ ఒకటి. బాబీ వారిద్దరి కోసం కథ రెడీ చేశారని తెలిసినప్పటి నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడు సినిమా మొదలవుతుందా ? అని ఎదురుచూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. జై లవకుశ మూవీ తర్వాత బాబీ చేస్తున్న ఈ సినిమాను ఈ నెల 11వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. అదే రోజు రెగ్యులర్ షూటింగ్ డేట్ ని ప్రకటించనున్నారు.

ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, కోన వెంకట్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు కలిసి నిర్మించనున్న ఇందులో వెంకటేష్ సరసన హుమా ఖ్యూరేషి నటిస్తుండగా, నాగచైతన్యతో రకుల్ ప్రీత్ సింగ్ రొమాన్స్ చేయనుంది. “వెంకీ మామ” అనే టైటిల్ ని ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ గా ఫిక్స్ చేశారు. ఈ సినిమా కంటే ముందు వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. f2 అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీలో వెంకీ .. వరుణ్ తేజ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ రెండు చిత్రాలను ఒకేకాలంలో పూర్తి చేస్తారా? లేకుంటే f2 తర్వాత వెంకీ మామ చేస్తారా ? అనేది త్వరలోనే తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus