వెంకీ..వారసుడు అంటూ ఎవరిని టార్గెట్ చేశాడు???

  • July 25, 2016 / 06:42 AM IST

టాలీవుడ్ టాప్ 4హీరోస్ లో ఒకడైన వెంకటేష్ ఈ మద్య కాస్త వెనకబడ్డాడు. అయితే కుర్ర హీరోల హావ పెరిగిపోవడం వల్లనో, లేక ఆయనకు అవకాశాలు తక్కువ కావడం వల్లనో విషయం అయితే తెలీదు కానీ ఆయన ముందు రోజుల్లో లాగా దూకుడుగా సినిమాలు మాత్రం చెయ్యడం లేదు. అయితే అదే క్రమంలో నిన్న జరిగిన వెంకీ ‘బాబు బంగారం’ ఆడియో వేడుకలో అందరి అనుమానాలకు చెక్ పెట్టేలా మాట్లాడాడు వెంకీ.

ఈ ఆడియోలో వెంకీ మాట్లాడుతూ….అందరికీ క్లియర్ కట్ ఐడియా వచ్చేలా….చెబుతూ…గత కొంతకాలంగా తాను సినిమాలకు కాస్త దూరంగా ఉన్నాను అని, అంతేకాకుండా సినిమాలు సైతం తగ్గించుకోవాలని అనుకున్నాను అని, అయితే ‘బాబు బంగారం’ లో తన లుక్ తన ఎనర్జీ చూకున్న తరువాత మరో 15 సంవత్సరాలు తాను నటిస్తూనే ఉంటానని కామెంట్స్ చేసాడు వెంకటేష్. అంతేకాకుండా తన వారసుడుగా తన కొడుకు ‘అర్జున్’ వచ్చే వరకూ తాను నటిస్తూనే ఉంటాను అని వెంకీ తెలిపాడు.

ఇక తన వారసుడుగా తన కొడుకు త్వరలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నాడు అని అభిమానుల్లో జోష్ నింపాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తే వెంకీ నటించిన బొబ్బిలి రాజా చిత్రం గుర్తొచ్చేలా ఉంది అంటున్నారు అభిమానులు. మరి ఈ సినిమా భారీ అయ్యిండంటే….విక్టరీ అభిమానులకు పండగే పండగ అని చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus