Venkatesh: ‘AK 47’ స్పీడ్ మామూలుగా లేదు.. థియేటర్స్ లోకి ముందే వస్తారా..

వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో సినిమా అంటేనే ఆ కిక్కే వేరు. వీరిద్దరి కాంబోలో ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ అనౌన్స్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే డిస్కషన్ నడుస్తోంది. ఈ లేటెస్ట్ మూవీ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం గురించి ఒక క్రేజీ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Venkatesh

లేటెస్ట్ టాక్ ఏమిటంటే, ఈ సినిమాను ఇదే ఏడాది మే నెలలో సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. నిజానికి షూటింగ్ మొదలై రెండు నెలలు కూడా గడవకముందే ఇంత తొందరగా సినిమాను తీసుకురావడం సాధ్యమేనా అనే డౌట్స్ కూడా వినిపిస్తున్నాయి. కానీ త్రివిక్రమ్ మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా షూటింగ్‌ను చకచకా పూర్తి చేస్తున్నారట. వేసవి సెలవులను టార్గెట్ చేసుకుని బాక్సాఫీస్ వద్ద విక్టరీ జాతరను ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ క్రైమ్ ఫ్యామిలీ డ్రామాలో వెంకటేష్ తన వింటేజ్ కామెడీ టైమింగ్‌తో సందడి చేయబోతున్నారు. ఆయనకు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, యంగ్ హీరో నారా రోహిత్ ఒక పవర్ ఫుల్ యాంటీ కాప్ రోల్‌లో కనిపించనున్నారు. సీనియర్ హీరో వెంకీ, నారా రోహిత్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకు మెయిన్ హైలైట్ అని తెలుస్తోంది. ఈ వెరైటీ మల్టీస్టారర్ టచ్ ఆడియన్స్‌కు కొత్త ఫీల్ ఇవ్వడం ఖాయం.

హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్న మ్యూజిక్ సినిమా రేంజ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్తుందని టీమ్ ధీమాగా ఉంది. ఇప్పటికే విడుదలైన వెంకీ లుక్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా రీచ్ అయ్యింది. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ఈ సినిమాలో గట్టిగానే ఉంటాయట. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే షూటింగ్ ఫుల్ స్పీడ్‌లో సాగుతోంది. 2026 వేసవికి టాలీవుడ్‌లో గట్టి పోటీ ఉండబోతోందని అర్థమవుతోంది. మే నెలలో రిలీజ్ అంటే సినిమా పనులన్నీ ఏప్రిల్ కల్లా పూర్తి కావాలి. మరి త్రివిక్రమ్ అనుకున్న టైమ్‌కు ఈ ‘ఆదర్శ కుటుంబం’ను థియేటర్లకు పంపిస్తారో లేదో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus