దీపావళికి ప్లాన్ చేసిన వెంకటేష్, నాగచైతన్యల క్రేజీ మల్టీస్టారర్ “వెంకీ మామ” షూటింగ్ జాప్యం కారణంగా దీపావళికి కానీ దసరాకి కానీ విడుదల కాలేకపోయింది. పోనీ డిసెంబర్ కి రిలీజ్ చేద్దామా అంటే.. ఆల్రెడీ సాయిధరమ్ తేజ్, బాలయ్యలు స్లాట్ బుక్ చేసుకొని రెడీగా ఉన్నారు. అందుకే.. సైలెంట్ గా సంక్రాంతి బరిలో నిలవడానికి సన్నద్ధమవుతున్నాడు “వెంకీ మామ”. ఆల్రెడీ జనవరి 12న విడుదలవ్వడానికి “అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు” చిత్రాలు పోటీపడుతుండడం, రజనీకాంత్ దర్బార్ ఏమో జనవరి 10వ తేదీ రిలీజ్ కి సిద్ధమవుతుండడంతో..
“వెంకీ మామ” చిత్రాన్ని జనవరి 11కి రిలీజ్ చేయడానికి సురేష్ బాబు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.సురేష్ బాబుకి థియేటర్స్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదు, అలాగే.. వెంకటేష్ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్, ముఖ్యంగా లేడీస్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ నమ్మకంతోనే సురేష్ బాబు “వెంకీ మామ” చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపడానికి సాహసం చేస్తున్నాడు. మరి ఈ ప్లానింగ్ ఎంత వరకూ సక్సెస్ సాధిస్తుందో చూడాలి.