టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన నయనతార జాతకం గురించి గతంలో వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. నయనతారకు పెళ్లి అచ్చిరాదని ఆయన కామెంట్లు చేశారు. పెళ్లి తర్వాత తన జీవితం సవ్యంగా సాగదని ఆయన కామెంట్ల్ చేశారు. వైవాహిక జీవితంలో కలతలు వస్తాయని వేణుస్వామి చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన విధంగా పెళ్లి తర్వాత నయన్ కు ఏదీ కలిసిరావడం లేదు.
పెళ్లి తర్వాత నయన్ పాజిటివ్ వార్తల కంటే నెగిటివ్ వార్తల ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ గా నయనతార ఊహించని స్థాయిలో క్రేజ్ ను కలిగి ఉండటంతో పాటు సినిమా సినిమాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు వరుస ఆఫర్లతో బిజీ అయిన నయనతారకు పెళ్లి తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో మూవీ ఆఫర్లు రావడం లేదు. ఇప్పటికే నయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు పూర్తి కాగా కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలేవీ వెలువడటం లేదు.
భారీ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం వల్లే దర్శకనిర్మాతలు ఆమెకు ఆఫర్లు ఇవ్వడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు సైతం ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోవడం లేదు. నయన్ భర్త విఘ్నేష్ కెరీర్ సైతం ఆశాజనకంగా లేదు. విఘ్నేష్ శివన్ కు దర్శకునిగా అవకాశాలు వచ్చినట్టే వచ్చి పోతున్నాయి.
విఘ్నేష్ శివన్ కు ఇప్పట్లో స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించే ఛాన్స్ రావడం కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. నయన్, విఘ్నేష్ కెరీర్ ఆశాజనకంగా లేకపోవడంతో ఫ్యాన్స్ సైతం ఫీలవుతున్నారు. నయన్, విఘ్నేష్ రాబోయే రోజుల్లో అయినా వరుస ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.
ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!
స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!