Ar Rahman: ఏఆర్‌ రెహమాన్‌ కూతురి పెళ్లి వీడియో ఇదిగో..!

  • June 14, 2022 / 02:16 PM IST

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్‌ పెద్ద కూతురు ఖతీజా రెహ్మాన్ వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. ఆ పెళ్లికి సంబంధించిన వీడియోను రెహమాన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. రియాస్దీన్ షేక్ మహమ్మద్‌ అనే సౌండ్‌ ఇంజనీర్‌తో మే5న ఆమెకి వివాహం జరిగింది. ఆ పెళ్లి సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు రెహమాన్‌.

ఖతీజా పెళ్లి వేడుకను సంప్రదాయపద్ధతిలో చెన్నైలో ఘనంగా జరిపారు. ఈ వేడుకకు సమీప బంధువులు హాజరయ్యారు. రెహమాన్‌ విడుదల చేసిన వీడియోలో వారందరినీ చూడొచ్చు. మరోవైపు రెహమాన్‌ కూతురి కోసం ఇటీవల మ్యూజికల్ వెడ్డింగ్ రిసెప్షన్ కూడా నిర్వహించారు. ఈ వేడుక వీడియో, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శుభాకాంక్షలు చెబుతూ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ వేడుకకు కొంతమంది సినీ ప్రముఖులు హాజరైనట్లు సమాచారం.

అందులో ప్రముఖ నటి మనీషా కొయిరాలా కూడా ఉన్నారు. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. పెళ్లి వేడుక వీడియోను సినిమా తీసినట్లే అన్నీ ప్లాన్‌ చేసుకొని తీశారు. ఈ మేరకు ఖతీజా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్‌ చేసి వివరాలు రాసుకొచ్చారు. దీని దర్శకుడు ఎవరు, సంగీతం ఎవరు, ఎగ్జిక్యూషన్‌, కో ఆర్డినేషన్‌, గ్రాఫిక్‌ డిజైనర్‌, వెడ్డింగ్‌ కేక్‌ అంటూ వివరాలు రాసుకొచ్చారు.

అలాగే పెళ్లి వేడుకలో ఏ రోజు కార్యక్రమానికి ఎవరు పని చేశారు అనే విషయాలు కూడా ఖతీజా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో చూడొచ్చు. ఇక రెహమాన్‌ కూతురు ఖతీజా గురించి చూస్తే… ఆమె సింగర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. 2010లో వచ్చిన ‘రోబో’ చిత్రంలో ‘ఓ మరమనిషి…’ అనే పాటను ఆలపించింది. అలాగే ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయిన కృతి సనన్‌ సినిమా ‘మిమి’లో ‘రాక్‌ ఏ బై బేబీ..’ అనే పాటను కూడా పాడింది.

1

2

3

4

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus