వైరల్ అవుతోన్న చిరు, ఖుష్బూ డ్యాన్స్ వీడియో..!

6 పదుల వయసు వచ్చినా మెగాస్టార్ చిరంజీవి డ్యాన్సుల్లో ఉన్న గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో ప్రూవ్ అయ్యింది. అయితే ఇటీవల వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో ఆ డ్యాన్స్ ల జోరు అంతగా కనిపించలేదు. ఆ కథ ప్రకారం సినిమాలో డ్యూయెట్స్ కు కానీ, డ్యాన్స్ కు కానీ అంత స్కోప్ దొరకలేదు. అయితే ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్లో చేయబోతున్న సినిమాలో మాత్రం డ్యాన్స్ లు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని తెలుస్తుంది.

అందుకు బెస్ట్ ఎగ్జామ్ఫుల్.. ఇటీవల చిరంజీవి నివాసంలో జరిగిన 80 దశకంలోని హీరో, హీరోయిన్ల రీయూనియన్ అని చెప్పొచ్చు. దక్షణాది చిత్ర పరిశ్రమకు చెందిన దాదాపు 40 మంది హీరో, హీరోయిన్లు ఈ పార్టీలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ పార్టీకి సంబందించిన ఫోటోలు ఇప్పటికే బయటకి వచ్చాయి. తాజాగా అప్పటి హీరోయిన్లతో మెగాస్టార్ చిరంజీవి చేసిన డ్యాన్స్ వీడియో కూడా తెగ వైరల్ అవుతుంది. ‘ఘరానా మొగుడు’ సినిమాలోని ‘బంగారు కోడి పెట్ట’ పాటకి చిరు, కుష్బూ డ్యాన్స్ లతో ఇరక్కొట్టారు . ఆ తరువాత జయప్రద, సుహాసిని కూడా జాయిన్ అయ్యారు. ఆ వీడియోని మీరుకూడా ఓ లుక్కెయ్యండి.


అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus