Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘సర్వం శక్తి మయం’ లోని పాత్రలలో ఎదో ఒక పాత్రకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు : దర్శకుడు ప్రదీప్ మద్దాలి

‘సర్వం శక్తి మయం’ లోని పాత్రలలో ఎదో ఒక పాత్రకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు : దర్శకుడు ప్రదీప్ మద్దాలి

  • November 3, 2023 / 05:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సర్వం శక్తి మయం’ లోని పాత్రలలో ఎదో ఒక పాత్రకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు : దర్శకుడు ప్రదీప్ మద్దాలి

సత్య దేవ్ హీరోగా ’47 డేస్’ అనే థ్రిల్లర్ ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన ప్రదీప్ మద్దాలి తన రెండో ప్రాజెక్ట్ గా ‘సర్వం శక్తి మయం’ అనే సిరీస్ కి దర్శకత్వం వహించారు. దీనికి కథను అందించిన బి వి ఎస్ రవి క్రియేటర్ గ వ్యవహరిస్తే, ప్రదీప్ మద్దాలి డైరెక్ట్ చేసారు. ఆహా లో విడుదల అయిన ఈ 10 ఎపిసోడ్ల సిరీస్ శక్తి పీఠాలు, హిందూ మతం లోని విశిష్ఠతను తెలియజేసే విధంగా ఆసక్తికరంగా రూపుదిద్దుకుంది. దసరా సందర్భంగా విడుదలైన సర్వం శక్తి మయం విశేష ఆదరణతో ఓ టి టి లో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రదీప్ మద్దాలి తన సంతోషాన్ని, అనుభవాలను పంచుకున్నారు….

మీ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పండి?

మాది రాజమండ్రి. నేను ఇంజినీరింగ్ అక్కడే చేశాను. ఆ తర్వాత ఐదేళ్లు ఐటి లో సి ఎస్ సి లో టీం లీడ్ గా పని చేశాను. తర్వాత నేను రామ్ గోపాల్ వర్మ గారితో, పూరి జగన్నాధ్ గారితో పరిచయం అయ్యాక నేను పూరి గారి దగ్గిర ఐదేళ్లు పనిచేసాను. తర్వాత 47 డేస్ తో దర్శకుడిగా మారాను.

‘సర్వం శక్తి మయం’ లాంటి చాలా పెద్ద స్పాన్ ఉన్న సబ్జెక్టు ని మీ సెకండ్ ప్రాజెక్ట్ గా తీసుకున్నప్పుడు రిస్క్ అనిపించలేదా. ఎలా హేండిల్ చేశారు?

– ఇలాంటి సబ్జెక్టు చేయడం చాలా పెద్ద బాధ్యత. నాకు బి వి ఎస్ రవి గారు బాగా పరిచయం. అయన ఏమన్నా ప్రాజెక్ట్స్ ని డిస్కస్ చేయడానికి పిలిచేవారు. సర్వం శక్తి మయం కి బి వి ఎస్ రవి గారు క్రియేటర్, రైటర్. ఆయన ఈ ఐడియా చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. చాలా మంచి అవకాశం అని వెంటనే చేస్తాను అన్నాను.

ఇంత పెద్ద ప్రాజెక్ట్ కి రవి గారు మిమ్మల్ని ఎంచుకున్నప్పుడు మీకేం అనిపించింది ?

– ఆయనకి నా గురించి బాగా తెలుసు. నేను పూరి గారి దగ్గిర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పటి నుండీ ఆయన నన్ను చూస్తున్నారు. మధ్యలో చాలా ప్రాజెక్ట్స్ అనుకున్నాం. ఆయన ఈ ఐడియా వచ్చిన వెంటనే దాన్ని పట్టుకుని ఆయనకీ వెర్షన్స్ ఇచ్చేవాడిని. అందుకనే ప్రదీప్ ఇది చేయగలడు అని నమ్మకం వచ్చుండొచ్చు.

రామ్ గోపాల్ వర్మ గారు, పూరి గారు, రవి గారు…. వీళ్ళ ముగ్గురిలో ఒక సిమిలర్ క్వాలిటీ చెప్పండి.?

– వారు వారి దారుల్లో ఉన్నా, కామన్ పాయింట్ ఏంటి అంటే థె అర్ రెబెల్ ఇన్ థేయిర్ ఒన్ వేస్

పూరి గారి దగ్గిర నేర్చుకున్న బెస్ట్ థింగ్ ఏంటి ?

– ఆయన పర్ఫెక్ట్ జెంటిల్మన్. సక్సెస్, ఫెయిల్యూర్ ని ఎలా తీసుకోవాలి, హీరో దగ్గిర నుండి లైట్ బాయ్ వరకు అందరినీ ఒకేలా చూసేవారు ఆయన. ఇలాంటి లైఫ్ లెసన్స్ ఎన్నో నేర్చుకోవచ్చు.

మీ ప్రాజెక్ట్ లో క్రియేటివ్ పర్సన్స్ అందరూ కలిసి చేసినట్టుంది. అందరితో ఎలా ట్రావెల్ అయ్యారు ?

– అది అలా కుదిరింది అండి. బి వి ఎస్ రవి గారు, ఈ ప్రాజెక్ట్ క్రియేటివ్ హెడ్ హేమంత్ మధుకర్ గారు చాలా రోజుల నుండీ దీని మీద వర్క్ చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళు చేయలేకపోయారు. తర్వాత నేను ఎంటర్ అయ్యాను. ప్రాజెక్ట్ స్కేల్ చాల పెద్దది. వర్కింగ్ డేస్ తక్కువే. 58 రోజుల్లో చేసాం కానీ లొకేషన్స్ కోసం చేసిన ట్రావెల్, రెక్కీ ఇవన్నీ బాగా సమయం తీసుకున్నాయి. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అవన్నీ చేయగలిగాము

ఇంత స్పిరిచ్యుల్ సబ్జెక్టు చేయడానికి మీరు కూడా స్పిరిచ్యుల్ గా ఉండాలి. ఎంత వరకు మీరు ఆ దారిలో ఉన్నారు ?

– మాది ఆర్థడాక్స్ ఫామిలీ. అమ్మ ఎప్పుడూ పూజలు చేస్తుంటారు. నేను మొదట్లో అలా ఉన్నా తర్వాత రామ్ గోపాల్ వర్మ గారితో, పూరి గారితో పనిచేసేటప్పుడు వాటాఇకి దూరంగా ఆలోచించేవాడిని. నా సొంత ప్రయత్నాలు మొదలుపెట్టాక మళ్ళీ నా రూట్స్ కి వెళ్లాల్సి వచ్చింది. నేను ఒక స్పిరిచ్యుల్ పాత్ తీసుకున్నాను. ధ్యానం, క్రియ యోగ, సిద్హ యోగ చేశాను. దానిలో ఉన్న శక్తి నాకు అర్థమైంది. మనం చేస్తున్న పనికి తోడుగా ఒక శక్తి, ఎనర్జీ ఉండాలనే విషయం అర్ధం అయింది. ఈ ఆలోచనలో ఉండగానే రవి గారి నుండి ఈ ప్రాజెక్ట్ వచ్చింది. రవి గారికి నేను ఈ ప్రాజెక్ట్ కి కరెక్టే అనుకోవడానికి ఇది ఒక కారణం అయ్యుండొచ్చు.

ఇలాంటి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే చాలా శ్రమ ఉంటుంది. ఎలా హేండిల్ చేయగలిగారు ?

– అదృష్టవశాత్తు మాకు అద్భుతమైన నటులు దొరికారు. ప్రియమణి గారు, సంజయ్ సూరి గారు, సమీర్ సోని గారు, ఆశ్లేష ఠాకూర్… లాంటి మెచ్యూర్డ్ ఆక్టర్స్ ఉండడంతో నా పని చాలా సులువు అయింది.

ఇలాంటి స్పిరిచ్యుల్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు కొన్ని మనం అనుకోకుండా ఏవ్ జరిగిపోతుంటాయి. అలాంటి మిరకిల్స్ ఎమన్నా ఉన్నాయా ?

– ఫస్ట్ షెడ్యూల్ మంచి సమ్మర్ లో స్టార్ట్ చేసాము. 18-20 రోజుల షెడ్యూల్ ఒరిస్సా నుండి కాశ్మీర్ వరకు ప్లాన్ చేసుకున్నాం. ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా అనుకున్న టైం లో పూర్తి చేసుకున్నాం. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అనుకున్నది అనుకున్నట్టు చేయడం పెద్ద మిరకిల్. మా నిర్మాతలు విజయ్ గారు, అంకిత్ గారు, కౌముది గార్లని అభినందించాలి. ముందుగా ఏ ఓ టి టి తో టై అప్ అవకుండా అవసరమైనంత ఖర్చు పెడుతూ ప్యాషన్ తో చేశారు. ప్రాజెక్ట్ అంతా ఎగ్జిక్యూట్ చేసాక ఓ టి టి కి వెళ్లాం. ఇది పెద్ద మిరకిల్ అనుకుంటాను.

చాలా వరకు హిందీ యాక్టర్స్ ఏ ఉన్నారు ? ఎందుకని ఆ కాస్టింగ్ కి వెళ్లారు ?

– మేము ఈ ప్రాజెక్ట్ ఇండియా అంతా రీచ్ అవ్వాలని హిందీ ప్రాజెక్ట్ లా చేసాం. అందుకని అందరినీ బాలీవుడ్ కాస్టింగ్ కి వెళ్ళాం. ప్రియమణి గారితో బ్యాలన్స్ చేశాం. ఆవిడ కాస్టింగ్ కూడా కథకి అనుగుణంగానే ఉంటుంది.

శక్తీ పీఠాల గురించి చేస్తున్నప్పుడు చిన్న మిస్ కమ్యూనికేషన్ జరిగినా ఎన్నో విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఆలా రాకుండా ఎలాంటి జాగర్తలు తీసుకున్నారు ?

– రీసెర్చ్ ఏ చాలా ఇండెప్త్ గా చేశారు. రవి గారూ, సిరా శ్రీ గారు వారితో పాటూ నేనూ డిస్కషన్ లో ఉండి స్క్రిప్ట్ రెడీ చేశాం. పేపర్ మీదనే చాలా లాజికల్ గా, రీజనింగ్ గా వచ్చింది. అలాంటి ఇబ్బంది ఎక్కడా రాలేదు.

ఈ శక్తి పీఠాలు అమ్మవారి శరీర భాగాలు పడిన స్థలాలుగా చెప్తుంటారు. వీటికి పురాణాలు, వేదాలలో ఆధారాలు ఉన్నాయా?

– అమ్మవారి శక్తి పీఠాల కథ ఇందులో చెప్పాము. దక్ష యజ్ఞం జరుగుతున్నప్పుడు సతీ దేవి తండ్రి, తన భర్త శివుడిని పిలవకుండా అవమానించినందుకు అవమాన భారంతో అదే హోమగుండంలో ఆవిడ ఆత్మాహుతి చేసుకున్నప్పుడు కోపం తో ఉన్న శివుడిని శాంతపరచడానికి శ్రీ మహావిష్ణువు ని ప్రాధేయపడితే, అమ్మవారి శరీరాన్ని ఖండించినప్పుడు ఆ శరీర భాగాలు పడ్డ ప్రాంతాలని మనం శక్తీ పీఠాలుగా కొలుస్తాం. రచయిత తోట ప్రసాద్ గారు నాతో అష్టాదశ శక్తిపీఠాలని శక్తిమంతమైనవిగా చెప్పారు. శరీర భాగాలతో పాటూ, ఆ రక్తం తో తడిచిన నేల అమ్మవారి శక్తితో నిండి ఉంది. అందుకే భారత దేశం గొప్పది అయింది. ఇది నమ్మకం మీద ఆధారపడి ఉండే అంశం.

ఆహా లో తెలుగు, తమిళ్ వెర్షన్, జీ 5 లో హిందీ వెర్షన్ ఉంది. రెస్పాన్స్ ఎలా ఉంది ?

– జీ 5 లో హిందీ లో జూన్ 9న రిలీజ్ అయింది. టెర్రిఫిక్ రెస్పాన్స్ ఉంది. అహా లో తెలుగు, తమిళ్ లో అక్టోబర్ 20న విడుదల అయింది. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. దేశం నలువైపుల నుండీ వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీ గా ఉంది. రెగ్యులర్ క్రైమ్, థ్రిల్లర్ జానర్ కాదు కాబట్టి పోను పోను ఎంతో మందికి రీచ్ అవుతుంది ఇంకా ఇంకా మాట్లాడుకుంటారు. ఎంతో మంచి స్పందన చూపిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు.

మీ తర్వాత ప్రాజెక్ట్ గురించి చెప్పండి?

– నా నెక్స్ట్ ప్రాజెక్ట్ రామ్ తాళ్లూరి గారి ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకమైన వెబ్ సిరీస్ చేస్తున్నాను, మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Priyamani
  • #sarvam shaktimayam
  • #Tollywood

Also Read

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

related news

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

trending news

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

19 mins ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

50 mins ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

3 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

5 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

6 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version