దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి నయనతార గత కొంత కాలం నుంచి దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజుల పాటు ప్రేమపక్షులలా విహరించిన ఈ జంట ఈనెల 9వ తేదీ పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు.ఈ క్రమంలోనే ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఎంతో ఘనంగా జరుగుతున్నట్లు సమాచారం.మొదట్లో వీరి వివాహం తిరుపతిలో జరుగుతుందని తెలిసినప్పటికీ తరువాత మహాబలిపురంలో వీరి వివాహం ఎంతో ఘనంగా జరుగుతుందని తెలిపారు.
ఇకపోతే జూన్ 9వ తేదీ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నయనతార గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నయనతార దర్శకుడు విగ్నేష్ ను వివాహం చేసుకోవాలంటే తన తల్లి మీరాకుమారి నయనతారకు ఒక కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ కండిషన్ కి నయనతార ఒప్పుకుంటేనే తనని కోడలుగా అంగీకరిస్తానని విగ్నేష్ తల్లి తెలిపారట. ఇంతకీ విగ్నేష్ తల్లి నయనతారకు పెట్టిన కండిషన్ ఏమిటి అనే విషయానికి వస్తే…
నయనతార ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకుంది అయితే వివాహం జరిగిన తర్వాత తను సినిమాల్లో నటించకూడదనే కండిషన్ పెట్టారట. తమ కుటుంబంలో ఎవరూ కూడా నటించడం లేదని అందుకే తాను కూడా సినిమాల్లో నటించకూడదని విగ్నేష్ తల్లి నయనతారకు కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇక ఆమె చెప్పిన విధంగానే నయనతార సినిమాలలో నటించనని తెలిపినట్లు సమాచారం.
ప్రస్తుతం నయనతార ఒప్పుకున్న సినిమాలన్నింటినీ పూర్తిచేసిన తర్వాత తాను తెరపై కనిపించదని తెలుస్తోంది. నటిగా వెండితెరకు దూరమయినప్పటికీ నిర్మాతగా మాత్రం ఇండస్ట్రీలో కొనసాగుతానని నయనతార చెప్పినట్లు సమాచారం.పెళ్లి జరిగిన తర్వాత నయనతార పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అవుతారని తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.అయితే ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!