Vijay: విజయ్ – త్రిష .. ఓపెన్ అయినట్టా.. తెగించినట్టా?

కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే (TVK) పార్టీ చీఫ్ దళపతి విజయ్(Vijay) పర్సనల్ లైఫ్ ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. ఆయన భార్య సంగీత రీసెంట్‌గా విడాకులకు అప్లై చేసిన సంగతి అందరికీ తెలిసిందే.ఓ నటితో విజయ్ కి ఎఫైర్ ఉందంటూ.. ఓ పొలిటీషియన్ ఇటీవల చేసిన కామెంట్స్..ని ఆమె నిజం చేసినట్టు అయ్యింది.ఈ వివాదం నడుస్తుండగానే విజయ్ ఇప్పుడు పెద్ద షాక్ ఇచ్చాడు.

Vijay

హీరోయిన్ త్రిషతో కలిసి పబ్లిక్‌గా ఓ ఫంక్షన్‌కు హాజరయ్యి అతను తన భార్య సంగీతని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడని చెప్పాలి.ప్రముఖ నిర్మాత కల్పాతి ఎస్. సురేష్ కొడుకు వెడ్డింగ్ రిసెప్షన్‌ చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు విజయ్, త్రిష కలిసి రావడం అందరినీ షాక్‌కు గురిచేసింది. విజయ్ చేతిలో పూలగుచ్చం పట్టుకుని కారు దిగగా, ఆయన వెంటే త్రిష కూడా రావడం.. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లడం హాట్ టాపిక్ అయింది.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.అసలు ఈ ఎంట్రీ ఇంత కాంట్రవర్సీ అవ్వడానికి మెయిన్ రీజన్ విజయ్ డైవర్స్ మ్యాటరే. 27 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విజయ్ భార్య సంగీత ఫిబ్రవరి 27న కోర్టులో విడాకుల పిటిషన్ వేశారు. విజయ్‌కు ఓ హీరోయిన్‌తో ఎఫైర్ ఉందని, 2021 నుంచే తనను ఎమోషనల్‌గా దూరం పెట్టారని, మానసికంగా ఎంతో క్షోభకు గురిచేశారని ఆమె ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇలాంటి సీరియస్ ఆరోపణలు, విడాకుల ప్రాసెస్ నడుస్తున్న టైమ్‌లో.. ఏకంగా త్రిషతో కలిసి విజయ్ ఫంక్షన్‌కు రావడంపై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. రాజకీయ, సినీ వర్గాలు కూడా దీన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ప్రముఖ సినీ విమర్శకుడు ప్రశాంత్ రంగస్వామి ‘ఎక్స్’ వేదికగా విజయ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.”విజయ్ అన్నా.. దీనికి ఎవరూ సపోర్ట్ చేయలేరు.

ఫ్యామిలీ ఫస్ట్.. మిగతావన్నీ ఆ తర్వాతే. లీగల్‌గా విడాకులు పూర్తయ్యాక మీరు ఎవరితో ఉన్నా ఎవరూ అడగరు. కానీ మిమ్మల్ని నమ్ముకున్న ఇద్దరు పిల్లలకు ఇది ఎంత పెయిన్ ఇస్తుందో ఆలోచించరా? సొంత బిడ్డల గురించే ఆలోచించలేని వారు.. రేపు రాజకీయాల్లోకి వచ్చి ప్రజల గురించి ఏం ఆలోచిస్తారు?” అంటూ కౌంటర్ ఇచ్చారు. విజయ్ అభిమానులు కూడా ఈ వ్యవహారాన్ని ఎలా కవర్ చేయాలో తెలీక సోషల్ మీడియాలో ఇబ్బందులు పడుతున్న సందర్భాలు కూడా చూస్తూనే ఉన్నాం.

ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

 

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus