పవర్ ఫుల్ పోలీసు పాత్రలో విజయ్ ఆంటోని

నకిలి, డాక్టర్ సలీమ్, బిచ్చగాడు, బేతాళుడు, యమన్, ఇంద్రసేన, కాశీ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ అంటోని. మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమైన విజయ్ ఆంటోని… ఆ తరువాత హీరోగా తెలుగులో డాక్టర్ సలీంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత విడుదలైన బిచ్చగాడు సినిమాతో అటు తమిళ ఇండస్ట్రీతో పాటు… ఇటు తెలుగులోనూ మంచి మార్కెట్టును క్రియేట్ చేసుకున్నాడు. అందుకే ఇటీవల అతని ప్రతి సినిమా… తమిళంతో పాటు.. తెలుగులోనూ రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపుతున్నారు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విజయ్ ఆంటోనీ…

తాజాగా ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుడున్నాడు. తమిళంలో తిమిరుపుడిచ్చవన్(Thimirupudichavan) అనే టైటిల్ ను కన్ ఫర్మ్ చేశారు. ఇటీవలే మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేయగా… రికార్డు స్థాయిలో డిజిటల్ వ్యూస్ వచ్చాయి. త్వరలోనే తెలుగు టైటిల్ ను కూడా ఖరారు చేయనున్నారు. ఈ చిత్రం తర్వలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని తన సొంత బ్యానర్ విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్నారు. నిర్మాత ఫాతిమా విజయ్ ఆంటోని. తనే ఈ చిత్రానికి సంగీతం వహిస్తుండగా… అతని సరసన నివేథా పేతురాజ్ (మెంటల్ మదిలో ఫేం) హీరోయిన్ గా నటిస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus