Vijay Antony Daughter: విజయ్‌ ఆంటోని ఇంట విషాదం.. బలవన్మరణానికి పాల్పడిన కుమార్తె!

ప్రముఖ తమిళ కథానాయకుడు, తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమైన విజయ్‌ ఆంటోని ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ‘బిచ్చగాడు’ సినిమాతో దక్షిణాదిన పెద్ద విజయం అందుకున్న విజయ్‌ ఆంటోని కుమార్తె మీరా (16) బలవన్మరణానికి పాల్పడింది. మంగళవారం వేకువజామును ఆమె ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని డీడీకే రోడ్‌లోని తన ఇంట్లో తెల్లవారుజామున 3 గంటలకు లారా ఉరేసుకుని అఘాత్యానికి పాల్పడినట్టు సమాచారం.

మీరా ఉరి వేసుకుందన్న విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఈ రోజు ఉదయం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆమె కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. మీరా చెన్నైలోని చర్చి గేట్‌లో ఉన్న చర్చి పార్క్‌ స్కూలులో 12వ తరగతి చదువుతోంది. మీరా గత కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడితో ఉన్నారని సమాచారం. ఈ మేరకు ఆమెకు వైద్యం కూడా చేయిస్తున్నారట. ఒత్తిడి కారణంగానే మీరా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ విషయంలో విచారణ కొనసాగుతోందని, త్వరలో వివరాలు వెల్లడించే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నట్లు సమాచారం. కూతురు ఆత్మహత్య నేపథ్యంలో పలువురు ప్రముఖులు విజయ్‌ ఆంటోనికి ఫోన్ చేసి సంతాపం తెలియజేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus