రాజ్యానికి ఎంతటి రాజైన ఓ కన్నతల్లికి కొడుకే.అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంతటి స్టార్ హీరో అయినా అతనికి సమాజంలో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతను కూడా ఓ తల్లి చాటు కొడుకే. ఇలా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతూ అద్భుతమైన సినిమాలలో నటిస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ పిల్లల పట్ల తల్లిదండ్రులు కంగారుగానే ఉంటారు. ఈ క్రమంలోనే నటుడు విజయ్ దేవరకొండ విషయంలో కూడా తన తల్లి ఈ విధమైనటువంటి కంగారు పడ్డారని
తాజాగా విజయ్ దేవరకొండ తన తల్లి భయం గురించి బయట పెట్టారు.విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో రానుంది. ఇక ఈ సినిమా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రావడంతో ఈ సినిమాలో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కూడా సందడి చేశారు. ఈ క్రమంలోని మైక్ టైసన్ కీలక సన్నివేశాలలో విజయ్ దేవరకొండతో పోటీపడుతున్నట్లు తెలుస్తోంది.
అయితే విజయ్ దేవరకొండ మైక్ టైసన్ మధ్య ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరించే సమయంలో తన తల్లి ఎంతో కంగారు పడ్డారని తాజాగా విజయ్ దేవరకొండ వెల్లడించారు. మైక్ టైసన్ ఎలాంటి ఛాంపియన్ అనేది అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తితో ఫైట్స్ సన్నివేశం అంటే అమ్మ తాను ఎక్కడ గాయపడతానో నని చాలా కంగారు పడిందంటూ ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన తల్లి భయం గురించి తెలియజేశారు.
ఇక ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ రానుండడంతో పెద్ద ఎత్తున సినిమా గురించి అప్డేట్ విడుదల చేస్తూ సినిమాపై అంచనాలు పెంచారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!