విజయ్ దేవరకొండ గురించి మాట్లాడేటప్పుడల్లా మనకు గుర్తొచ్చే అంశం ‘రౌడీ స్టార్’. నిజానికి ఈ పేరు ఆయనకు మనం పెట్టలేదు. అలా అని అభిమానులు కూడా పెట్టలేదు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో ఆయన యారగెన్స్, ఆ సినిమా తర్వాత ఆయన చూపించిన యాటిట్యూడ్, అదే దారిలో ఆయన తీసుకొని రౌడీ బ్రాండ్ దుస్తులు ఆయనకు ఆ పేరు పెట్టాయి. అయితే విజయ్ పర్సనల్ లైఫ్‌లో మరో విషయం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. అదే లవ్ స్టోరీలు.
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే హీరో అవ్వకపోయినా… హీరో అయిన తక్కువ రోజుల్లోనే ప్రేమ వ్యవహారాల్లో పేరు వచ్చేలా పరిస్థితులు మారిపోయాయి. ‘గీత గోవిందం’ సినిమా వచ్చాక ఇది ఇంకా ఎక్కువైంది. అలాంటి విజయ్ ఎలాంటి వివాహం చేసుకుంటాడు, నిజ జీవితంలో ప్రేమ ఉందా? ఉంటే ఎవరు అనే ప్రశ్నలు చాలా రోజుల నుండి వస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ మీట్లో విజయ్ దీని గురించి మాట్లాడాడు.
విజయ్ను పెళ్లి గురించి అడిగితే… మొదట్లో ఇంట్లో వాళ్లు ఎవరూ పెళ్లి గురించి నా దగ్గర మాట్లాడేవారు కాదు. పెళ్లి అనే మాట వింటే నాకు కోపం, చిరాకు వచ్చేసేవి. అయితే ఇప్పుడు నేనే పెళ్లి గురించి చర్చిస్తున్నాను. నా ఫ్రెండ్స్‌కి పెళ్లి అవుతుంటే ఆనందిస్తున్నా. వాళ్ల మ్యారీడ్ లైఫ్‌లో కష్టసుఖాలను తెలుసుకుంటున్నా. పెళ్లి అనేది జీవితంలో ఒక అధ్యాయం అని అనిపిస్తోంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలి అనే నిర్ణయానికి వచ్చేశాను.
అంతేకాదు భయపెట్టే విషయాల గురించి ఆలోచిస్తే పెళ్లి చేసుకోలేం. పెళ్లిలో ఉన్న అందమైన విషయాలపైనే దృష్టి పెట్టాలి అని చెప్పాడు. మరి ప్రేమ సంగతి ఏంటి అంటే… ‘అర్జున్‌రెడ్డి’లోని కొంత కథ నా జీవితంలో ఉంది. అలాగే ‘డియర్ కామ్రేడ్’ కథ కూడా కొంత పార్టు ఉంది. ‘గీత గోవిందం’ లాంటి కథ మాత్రం నా జీవితంలో లేదు అని చెప్పేశాడు విజయ్. మరి ఆ ప్రేమ విషయం తెలియాలంటే రెండు, మూడేళ్లు పడుతుంది అని చెప్పాడు.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!