సాధారణంగా సినీ ఇండస్ట్రీలో .. డేటింగ్ లు అలాగే ప్రేమ వ్యవహారాలు గురించి ఎక్కువగా రూమర్లు వస్తుంటాయి. వాటి గురించి కొన్ని ఇంటర్వ్యూలలో వారిని నేరుగా అడిగినా.. ‘అబ్బే అలాంటిదేమీ లేదు.. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్, ఈ రూమర్స్ ఎలా వస్తాయో మాకు తెలీడం లేదు’ .. ఎక్కువగా ఇలాంటి సమాధానాలే వస్తుంటాయి. వారు చెప్పే సమాధానాల.. వెనుక మరో అర్థం ఉందనే విషయాల్ని.. నెటిజన్లు సైతం కనిపెట్టేస్తారు. అసలు విషయాన్ని.. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్లలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ హీరోయిన్ ఇజా బెల్లా కూడా ఒకరు.
ఏమాత్రం డొంక తిరుగుడు లేకుండా అడిగిన ప్రశ్నలకి ఉన్నది ఉన్నట్టుగా సమాధానాలు చెప్పేస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే.. ‘మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా?’ అని ప్రశ్నించగా.. “ప్రేమ లాంటిది ఏమీ లేదు కానీ.. చదువుకునే రోజుల్లో ఓ వ్యక్తితో నాలుగేళ్లు డేటింగ్ చేశాను. తరువాత అభిప్రాయాలు సెట్ అవ్వట్లేదు అని భావించి బ్రేకప్ అయ్యాను. ప్రస్తుతం నేను సింగిల్..! ప్రేమ వివాహం చేసుకోవాలని ఉంది. నాకు లైఫ్ పార్ట్నర్ కు కాస్త నీతి, నిజాయితీ ఉంటే చాలు..” అంటూ నిజాయితీగా జవాబిచ్చింది ఇజా బెల్లా..!