వంద మంది ఫాన్స్ ను ట్రిప్ పంపిన విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్!

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మనకు తెలిసిందే ముఖ్యంగా ఈయనకు యూత్,అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ సినిమాలో పరంగా ఈయన నటన కన్నా తన ప్రవర్తనకు ఎంతోమంది ఈయనకు అభిమానులుగా మారిపోయారు. ఇలా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఇకపోతే ఈయన గత ఐదు సంవత్సరాలుగా ప్రతి క్రిస్మస్ పండుగకు దేవర శాంటా పేరిట పెద్ద ఎత్తున బహుమతులను ఇస్తూ సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. అయితే గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఈయన తన వందమంది అభిమానులను సర్ప్రైజ్ ట్రిప్ పంపిస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే దేశం నలమూలల నుంచి 100 మందిని సెలెక్ట్ చేసి వారిని ఐదు రోజుల పాటు కులుమనాలి ట్రిప్ పంపిస్తున్నట్లు విజయ్ దేవరకొండ ప్రకటించారు.

ఈ విధంగా ఈ 100 మందికి అక్కడ అన్ని వసతులతో కూడిన ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఖర్చులు అన్నింటిని కూడా విజయ్ దేవరకొండ భరించారు. అయితే గత కొద్ది రోజుల క్రితం ఈ 100 మంది పేర్లను కూడా ఈయన సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

ఈ క్రమంలోనే తన అభిమానుల 100 మందిని ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఐదు రోజులపాటు ట్రిప్ పంపించినట్లు ఈయన తెలిపారు. ఈ క్రమంలోనేఈ వంద మంది అభిమానులు ఫ్లైట్లో ఎంతో ఎంజాయ్ చేస్తూ ప్రయాణించినటువంటి ఒక వీడియోని తనకు షేర్ చేయడంతో విజయ్ దేవరకొండ ఆ వీడియోని ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.. ఈరోజు ఉదయం ఫ్లైట్లో వాళ్ళు ఉన్నటువంటి ఒక వీడియోని నాకు షేర్ చేశారు. పర్వతాలలోకి హాలిడే ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు దేశం నలమూలల నుంచి 100 మంది అభిమానులను ఇలా పంపించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus