Vijay Devarakonda: వారిని చూడగానే పెళ్లి పై ఇంట్రెస్ట్ కలిగింది… త్వరలోనే పెళ్లి!

సినీ నటుడు విజయ్ దేవరకొండ త్వరలోనే ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.. ఈ క్రమంలోని ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.ఇందులో భాగంగానే ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. అయితే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నటుడు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు. విజయ్ దేవరకొండ పెళ్లి గురించి తరచూ సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి.

ఈ క్రమంలోనే పెళ్లి గురించి ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఖుషి సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని తెలిపారు. ఈ సినిమాలో హిందూ సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పెళ్లి బంధం ఎలా ఉంటుందోనని చాలా స్పష్టంగా తెలియజేశారని తెలిపారు. ఈ సినిమా చేసిన తర్వాత నాకు ప్రేమ కథ సినిమాలలో నటించాలని ఉందని ఈయన తెలియజేశారు. అంతేకాకుండా ఇదివరకు నా స్నేహితులు ఎవరూ కూడా నా దగ్గరకు వచ్చి పెళ్లి గురించి మాట్లాడే వారే కాదు.

పెళ్లి పై నాకు ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు. అయితే నా స్నేహితులంతా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారు. వారిని చూసి నాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపించిందని ఈయన తెలిపారు. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలోను పెళ్లి అనేది ఒక ఇంపార్టెంట్ చాప్టర్.

నేను కూడా ఈ చాప్టర్లోకి మరో మూడు సంవత్సరాలలో అడుగుపెట్టబోతున్నాను అంటూ ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మరో మూడు సంవత్సరాలలో తాను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ ఈ సందర్భంగా తెలియజేశారు.ఇలా పెళ్లి గురించి (Vijay Devarakonda) విజయ్ దేవరకొండ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus