బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న విజయ్ దేవరకొండ

  • September 19, 2018 / 06:52 AM IST

స్టార్ హీరోలతో సమానంగా విజయ్ దేవరకొండ క్రేజ్ ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మూడు విజయాలతో ఈ క్రేజ్ సంపాదించడం గొప్ప విషయం. అందుకే అతని చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాలు ఉన్నాయి. టాక్సీ వాలా రిలీజ్ కి సిద్ధమవుతోంది. నోటా వచ్చే నెల 4 న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నారు. ఇక త్వరలో డియర్ కామ్రేడ్ కూడా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మరో రెండు స్క్రిప్ట్ దశలో ఉన్నాయి. ఇలా ఫుల్ బిజీ అయిపోయారు. అతని డేట్స్ కోసం దర్శకులు, నిర్మాతలు క్యూలో ఉన్నారు. బాలీవుడ్ దర్శకుల చూపు కూడా విజయ్ పై పడింది. అందుకే అతనితో సినిమా తీయాలని కోరుకుంటున్నారు.

తాజాగా దర్శక ద్వయం రాజ్ – డీకే దర్శకత్వంలో నటించడానికి విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మిస్తారని సమాచారం. ఈ మూవీ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇప్పటివరకు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలు రామ్ చరణ్ తేజ్, రానా, సుధీర్ బాబు వంటి యంగ్ హీరోలు బాలీవుడ్ లో అడుగుపెట్టారు. కానీ ముందుకు వెళ్లలేకపోయారు. ప్రభాస్, మహేష్ బాబులకి ఆహ్వానాలు వస్తున్నప్పటికీ ఆలోచిస్తున్నారు. విజయ్ దేవరకొండ మాత్రం బాలీవుడ్ హీరోలతో పోటీ పడేందుకు ఓకే చెప్పారు. అక్కడ కూడా విజయ్ దూసుకుపోతారని ఆశిద్దాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus