టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఆరోగ్యం గురించి గత 4,5 రోజులుగా ఏవేవో వార్తలు వినిపిస్తున్నాయి. అతను లేవలేని పరిస్థితుల్లో ఉన్నట్లు ఆ వార్తల సారాంశం. ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న ఈ వార్త విజయ్ చెవిన పడింది. ఈ వార్తలపై వెంటనే స్పందించి క్లారిటీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. 8 నెలల క్రితం అంటే ‘లైగర్’ షూటింగ్ జరుగుతున్న టైంలో విజయ్ దేవరకొండ భుజానికి గాయమైంది. షూటింగ్ వాయిదా పడటం ఇష్టం లేక ..
భుజం నొప్పిని లెక్కచేయకుండా ‘లైగర్’ షూటింగ్ కంప్లీట్ చేసి ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్నాడు విజయ్.అటు తర్వాత దీనికి శస్త్ర చికిత్స తీసుకున్నాడు. దీని పై స్పందించి క్లారిటీ ఇచ్చాడు విజయ్. తాజాగా ఈ విషయంపై స్పందించిన విజయ్ భుజం నొప్పి నుండి పూర్తిగా కోలుకున్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తను చేతులు చూపిస్తూ ఓ ఫోటోను షేర్ చేశాడు. ‘8 నెలల ట్రీట్మెంట్ తర్వాత నొప్పి పూర్తిగా తగ్గిపోయింది.
బీస్ట్ బయటకు రావడానికి తాపత్రయ పడుతుంది. అది ఇంతకాలం పంజరంలో ఉండిపోయింది’ అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పేర్కొన్నాడు విజయ్.కాబట్టి.. విజయ్ ఆరోగ్యం విషయంలో ఎటువంటి కంగారు పడనవసరం లేదు. ఇక సినిమాల విషయానికి వస్తే విజయ్… ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
అదే ‘ఖుషి’. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి భారీ బిజినెస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘లైగర్’ కోసం విజయ్ ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోయింది. అయినప్పటికీ దాని ఫలితం ‘ఖుషి’ పై పడలేదు.