Vijay Devarakonda: ట్రెండ్ అవుతున్న విజయ్ దేవరకొండ లుక్?

రౌడీ హీరోగా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకొని అతి తక్కువ సమయంలోనే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు నటుడు విజయ్ దేవరకొండ. ఈయన ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో లైగర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా అన్ని భాషలలో ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.

అయితే ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి ఎంతో సింపుల్ గా అటెండ్ అయిన విషయం మనకు తెలిసిందే. సాధారణ వ్యక్తిలా టీషర్ట్ వేసుకొని ₹200 చెప్పులు ధరించి ఈ కార్యక్రమానికి హాజరై ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ విధంగా విజయ్ దేవరకొండ చెప్పులతో రావడం చూసిన హీరో రణవీర్ సింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ చెప్పులతో వచ్చిన ఎంతో స్టైలిష్ గా ఉన్నారంటూ కామెంట్ చేశారు.

అయితే విజయ్ దేవరకొండ ఇలా తన సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి చెప్పులతో రావడం వెనుక ఓ పెద్ద కారణం ఉందని తెలుస్తోంది. టైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక రోడ్ సైడ్ కిడ్ లా కనపడతారు.తను సినిమాలో ఎలా అయితే కనిపిస్తారో ఈ సినిమా ట్రైలర్ కార్యక్రమంలో కూడా అలాగే ఉండాలన్న ఉద్దేశంతోనే విజయ్ దేవరకొండ ఇలా అటెండ్ అయ్యారని తెలుస్తుంది. ఈ విధంగా కనిపించడం

కోసం ఆయన 200 రూపాయలతో ఇలాంటి స్లిప్పర్ డిజైన్ చేయించుకున్నారని, విజయ్ దేవరకొండ స్టైలిస్ట్‌ హర్మాన్‌ కౌర్‌ వెల్లడించారు. అందుకే విజయ్ దేవరకొండ ఎంతో సింపుల్ గా ఈ కార్యక్రమానికి టీ షర్ట్ నార్మల్ స్లిప్పర్ ధరించి వెళ్లినప్పటికీ ఈ ట్రెండ్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఎంతోమంది యువకులు విజయ్ దేవరకొండ స్టైల్ అనుసరిస్తూ ఉండడం విశేషం. ఏది ఏమైనా ఈ రౌడీ హీరో మరొక ట్రెండ్ సెట్ చేశారని చెప్పాలి.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus