విజయ్ దేవరకొండ సినిమాలకంటే మనోడు తన సినిమా ఫంక్షన్స్ లో ఇచ్చే స్పీఛ్ లు బాగుంటాయి. లోపలోకటి పెట్టుకొని బయట ఒకలా మాట్లాడడం రాని విజయ్ దేవరకొండ నిన్న “టాక్సీ వాలా” ప్రీరిలీజ్ ఈవెంట్ లోనూ తనదైన శైలి స్పీచ్ తో విశేషంగా ఆకట్టుకొన్నాడు. తనతో కలిసి నటించిన, పనిచేసిన వాళ్లందరినీ పేరు పేరునా ప్రేక్షకులకు పరిచయం చేయడమే కాక వాళ్లందరి ఈ రెండేళ్ల కాలంలో సినిమా విడుదల కోసం పడిన కష్టాలను అందరికీ చెప్పి వాళ్ళని ఇన్స్ ఫైర్ చేశాడు. అలాగే.. చాలా సైలెంట్ గా పైరసీ సినిమా చూసి రివ్యూలు రాసినవాళ్లందరి మీద కూడా “అసలు ఎడిటింగ్, సీజీ, సౌండ్ లేకుండా మూడున్నర గంటల సినిమా ఎలా చూస్రారా బాబు. మీకు ఓపికకి దండం” అని గట్టి సెటైర్ వేశాడు.
పైగా.. చివర్లో “నాతో నవంబర్ 17న సినిమా ఎంతమంది చూస్తారు?, ఎందుకంటే థియేటర్లో అందరం సినిమా చూసి.. పైరసీ చేసిన, పైరసీ లింక్స్ ను పోలోమని షేర్ చేసినవాళ్లందరికీ మిడిల్ ఫింగర్ చూపిద్దాం మనం” అని పైరసీదారులకు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. మరి విజయ్ వార్నింగ్ ఎంతవరకూ పనిచేస్తుంది అనేది నవంబర్ 17కి తెలుస్తుంది.