Trivikram, Vijay: విజయ్ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారా?

టాలీవుడ్ హీరోలలో ఒకరైన విజయ్ దేవరకొండకు ప్రస్తుతం ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవసరం అనే సంగతి తెలిసిందే. వరుస ఫ్లాపులతో విజయ్ దేవరకొండ మార్కెట్ తగ్గింది. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం తరహా సక్సెస్ సాధిస్తే మాత్రమే విజయ్ కెరీర్ పుంజుకుంటుందని చెప్పవచ్చు. లైగర్ ఫ్లాప్ తో విజయ్ దేవరకొండ కెరీర్ విషయంలో తప్పటడుగులు వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం విజయ్ సమంత హీరోహీరోయిన్లుగా ఖుషి పేరుతో ఒక సినిమా తెరకెక్కుతోంది.

అయితే విజయ్ దేవరకొండ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో ఒక సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత కూడా త్రివిక్రమ్ స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కించనున్నారు. అయితే కొన్ని నెలల క్రితం త్రివిక్రమ్ విజయ్ దేవరకొండకు ఒక లైన్ వినిపించారని బోగట్టా. త్రివిక్రమ్ వినిపించిన లైన్ విజయ్ దేవరకొండకు బాగా నచ్చిందని బోగట్టా.

ఈ సినిమాకు కథ నేనే అందిస్తానని మరో డైరెక్టర్ డైరెక్షన్ లో నటించాలని త్రివిక్రమ్ విజయ్ దేవరకొండకు సూచించారని తెలుస్తోంది. విజయ్ మాత్రం త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారని బోగట్టా. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందో లేదో క్లారిటీ రావాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. మేజర్ సినిమాతో సక్సెస్ సాధించిన శశికిరణ్ తిక్క డైరెక్షన్ లో ఈ సినిమాను తెరకెక్కించాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు.

విజయ్ దేవరకొండ శశికిరణ్ డైరెక్షన్ లో నటించడానికి అంగీకరిస్తారో లేదో చూడాలి. విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. లైగర్ ఫ్లాప్ తో విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ సైతం తగ్గిందని సమాచారం అందుతోంది. విజయ్ దేవరకొండ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus