Vijay Deverakonda: రౌడీ హీరో క్రేజ్ మామూలుగా లేదు.. ఏకంగా వీపుపై టాటూ?

Advertisement

ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లిచూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. అనంతరం అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. రౌడీ హీరోకి లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండకు ఎక్కువగా అమ్మాయిలే అభిమానులుగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఒక అమ్మాయి విజయ్ దేవరకొండ పై ఉన్న అభిమానంతో ఏకంగా తన వీపుపై రౌడీ హీరో ఫేస్ ఫోటోని టాటూగా వేయించుకుంది. ఈ క్రమంలోనే ఈ టాటూకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. తాజాగా ఆ అభిమాన నటుడిని కలిసిన ఇద్దరు అమ్మాయిలతో ఒక అమ్మాయి విజయ్ దేవరకొండకు వీరాభిమాని. తాజాగా విజయ్ దేవరకొండను కలిసిన ఈ అమ్మాయిలు అతనితో కలిసి కాసేపు సరదాగా గడపడమే కాకుండా వీపుపై విజయ్ దేవరకొండ టాటూ చూడగానే ఒక్కసారిగా రౌడీ హీరో ఆశ్చర్యపోయారు.

ఇక తన అభిమాన హీరోని కలిశానన్న ఆనందంలో ఆ అమ్మాయి ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియోని లైగర్ టీం సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పూరి జగన్నాథ్, ఛార్మి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ వీడియోని షేర్ చేస్తూ…సూపర్ ఫ్యాన్ మూమెంట్.. కొందరు అభిమానులు ఈ విధంగా తమ శరీరంపై టాటూతో తమ అభిమానాన్ని..

తెలియజేస్తున్నారు అంటూ మేకర్స్ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో చూసిన కొందరు తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు చేయగా, మరికొందరు విమర్శిస్తూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news