Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Advertisement

తమిళనాడు పాలిటిక్స్‌లో ఇప్పుడు ఓ హిస్టారికల్ మూమెంట్ నడుస్తోంది. 1967 నుంచి డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల చుట్టూ తిరుగుతున్న తమిళ రాజకీయాలకు దళపతి విజయ్(Vijay) చెక్ పెట్టాడు.

Vijay

2026 అసెంబ్లీ ఎలక్షన్స్‌లో విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం'(TVK) పార్టీ ఏకంగా 107 సీట్లు గెలుచుకుని, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.

డీఎంకే 74 సీట్లకు పరిమితం కాగా, ఎన్డీయే 53 సీట్లు గెలుచుకుంది. మెజారిటీ మార్క్ 118 కి టీవీకే కొద్ది దూరంలో ఉన్నా.. విజయ్ సీఎం అవ్వడం దాదాపు ఖాయమైపోయింది. అయితే, ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్న విజయ్.. ఒకప్పుడు పాలిటిక్స్ వద్దని కన్నతండ్రిపైనే కేసు వేశాడనే విషయం చాలామందికి తెలియదు.

అసలు సొంత తల్లిదండ్రులపైనే ఆయన కేసు ఎందుకు వేశాడంటే.. 2020లో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ విజయ్ అభిమాన సంఘాన్ని ‘విజయ్ మక్కల్ ఇయక్కం'(VMI) పేరుతో రాజకీయ పార్టీగా మార్చేశారు. ఈ పార్టీకి ఆయన జనరల్ సెక్రటరీగా ఉంటూ, విజయ్ తల్లి శోభను కోశాధికారిగా చేశారు. కానీ, ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ డెసిషన్ తీసుకునేముందు వాళ్లు విజయ్‌ను కనీసం సంప్రదించలేదట. తన ప్రమేయం లేకుండా పొలిటికల్ పార్టీ పెట్టడం అప్పట్లో విజయ్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

ఈ పరిణామాలతో 2021 సెప్టెంబర్‌లో తన పేరు, ఫోటోలు, ఫ్యాన్ క్లబ్ పేరును ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు వాడకూడదని.. తల్లిదండ్రులతో సహా 11 మందిపై విజయ్ ఏకంగా కోర్టులో లా సూట్ (కేసు) ఫైల్ చేశాడు. తండ్రి స్థాపించిన ఆ పార్టీతో తనకు డైరెక్ట్‌గా గానీ, ఇన్‌డైరెక్ట్‌గా గానీ ఎలాంటి సంబంధం లేదని అప్పట్లో ఓపెన్‌గా క్లారిటీ ఇచ్చాడు.అయితే, 3 ఏళ్ళు తిరిగేసరికి విజయ్ మనసు పూర్తిగా మారిపోయింది. 2024 ఫిబ్రవరిలో స్వయంగా తానే ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీని అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు.

పెరియార్, అంబేద్కర్, కామరాజ్ సిద్ధాంతాల స్ఫూర్తిగా, సామాజిక న్యాయం లక్ష్యంగా సెప్టెంబర్‌లో ఎలక్షన్ కమిషన్ దగ్గర పార్టీని రిజిస్టర్ చేశాడు. 2026లో తొలిసారి డైరెక్ట్ ఎలక్షన్స్‌లో అడుగుపెట్టిన విజయ్.. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో గెలుపొందాడు. ఒకప్పుడు రాజకీయాలు వద్దని తండ్రిపైనే కేసు వేసిన విజయ్.. ఇప్పుడు ఏకంగా తమిళనాడుకు సీఎం కాబోతుండటం చూసి పొలిటికల్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus