Vijay Sethupathi: ఇంస్టాగ్రామ్ లో విజయ్ ఎంతమందిని ఫాలో అవుతున్నారో తెలుసా?

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఒకరు. ఇలా హాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు విజయ్ సేతుపతి పరిచయమయ్యారు. ఇలా మొదటి సినిమాతోనే హీరోయిన్ తండ్రి పాత్రలో నటించి మెప్పించినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు.

ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇక సోషల్ మీడియా విషయానికి వస్తే ఈయన సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. కేవలం తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే తెలియజేస్తుంటారు. అయినప్పటికీ ఈయనకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఈయనకు (Vijay Sethupathi) ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 7.3మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా ఇంత మంది ఫాలోవర్స్ ఉన్నప్పటికీ ఈయన మాత్రం కేవలం 7 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. ఈ విధంగా విజయ్ సేతుపతి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నటువంటి ఆ ఏడుగురు ఎవరు అనే విషయానికి వస్తే…

లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త డైరెక్టర్ విఘ్నేష్ శివన్, తమిళ్ డైరెక్టర్ మిస్కిన్, హీరోయిన్ అంజలి, కోలీవుడ్ నటుడు రమేష్ తిలక్, కోలీవుడ్ గేయ రచయిత కార్తీక్ నేత, డైరెక్టర్ రంజిత్ జయకోడి, తర్వాత తన సొంత నిర్మాణ సంస్థ అయినటువంటి విజయ్ సేతుపతి ప్రొడక్షన్స్ ను మాత్రమే ఈయన ఫాలో అవుతున్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus