రీ ఎంట్రీ రెడీ అయిన రాములమ్మ..?

  • May 12, 2016 / 01:36 PM IST

విజయశాంతి మళ్ళీ చిత్రాల్లో నటించనుందా..?  ఆమె రీ ఎంట్రీ ఇస్తోందా..? అంటే అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయాల్లో కీలకంగా ఉండి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిన్నుకుండిపోయిన రాములమ్మ తిరిగి చిత్రాల్లో నటించడానికి సిద్దమౌతుందట. దేశభక్తి కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రంలో ఆమె నటించనుండగా..

ఈ చిత్రం కోసం ఆమె మిలిటరీ తరహా శిక్షణ తీసుకుంటోందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రానికి..  ఓ తమిళ దర్శకుడు దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడని సమాచారం. ఈ చిత్రం దసరాకి సెట్స్ వెళ్లనుండగా.. జనవరి లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే యోచనలో చిత్ర బృందం ఉందట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus