Vijayashanti: విజయశాంతి పై అవన్నీ ఫేక్ వార్తలేనట!

కొద్దిరోజుల నుండి ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది. అదేంటి అంటే.. లేడీ సూపర్ స్టార్ గా పిలవబడే విజయశాంతి కొడుకు త్వరలోనే హీరోగా పరిచయం కాబోతున్నాడు అని.! కొంతమంది ఈ వార్తని తెలీకుండానే వైరల్ చేసేస్తున్నారు. నిజానికి విజయశాంతి కి పిల్లలు లేరు. మరి కొడుకు ఎక్కడి నుండి వచ్చాడు? అతన్ని విజయశాంతి హీరోని ఎలా చేస్తుంది? 1988 లోనే విజయశాంతి శ్రీనివాస ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.

కానీ ఈ విషయాన్నిఆమె గోప్యంగా ఉంచింది. సినిమాల్లో ఉన్నన్ని రోజులు ఆమె ఆ విషయాన్ని బయటపెట్టలేదు. కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాత్రం ఆమె బయటపెట్టక తప్పలేదు. ఇదే విధంగా ఆమెకు కొడుకున్నాడు, అతను హీరో అవుతున్నాడు అనే విషయంలో ఎటువంటి నిజం లేదు. విజయశాంతికి కమ్యూనిష్ట్ భావాలు ఎక్కువ. అందుకే ఆమె సమాజ సేవ కోసం పిల్లల్ని కనాలనుకోలేదు. అందులోనూ పెళ్లి కూడా ఆలస్యంగా చేసుకున్నారు.

పిల్లలు వద్దు అనుకుని (Vijayashanti) విజయశాంతి, ఆమె భర్త డిసైడ్ అయ్యాకే పెళ్లి చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నాయకురాలిగా కొనసాగుతున్న విజయశాంతి మొన్నామధ్య మహేష్ బాబు- అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఈమె ఎటువంటి సినిమాకి సైన్ చేయలేదు.

‘సరిలేరు నీకెవ్వరు’ కూడా అనిల్ రావిపూడి కోసమనే ఒప్పుకున్నట్టు స్పష్టమవుతుంది. భవిష్యత్తులో ఆమె సినిమాల్లో నటించే అవకాశం ఉండొచ్చు… ఉండకపోవచ్చు. కానీ ఆమెకు కొడుకైతే లేడు.. ఆమె పై వస్తున్న వార్తలు కూడా అవాస్తవం అనే చెప్పాలి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus