తెలుగు చిత్ర పరిశ్రమలో ఫుల్ క్రేజ్ లో ఉన్న హాస్యనటుడు పృథ్వీరాజ్. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఆలస్యంగా ఫామ్లోకి వచ్చిన ఇతనికి విజయవాడ ఫ్యామిలీ కోర్టు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్న పృథ్వీరాజ్ కి ఈ తీర్పు విని ఆలోచనలో పడ్డట్టు తెలిసింది. నటుడు పృథ్వీరాజ్‌పై ఉన్న కేసు ఏమిటి? తీర్పు ఏంటో తెలుసుకోవాలంటే.. కొన్ని రోజులు వెనక్కి వెళ్ళాసిందే. విజయవాడ అరండల్‌పేటకు చెందిన శ్రీలక్ష్మిని నటుడు పృథ్వీరాజ్ 1984లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీలక్ష్మి తల్లిదండ్రులు విజయవాడలో మిఠాయి దుకాణం నిర్వహించేవారు. తండ్రి చనిపోవడంతో శ్రీలక్ష్మి, పృథ్వీరాజ్‌లు కొన్నాళ్లు ఆ దుకాణం చూసుకున్నారు. ఆ సమయంలోనే నటనపై ఆసక్తితో తరచూ చెన్నై వెళ్లేవారు పృథ్వీరాజ్.
సినీ రంగంలో రాణించడంతో ఫ్యామిలీ హైదరాబాద్‌కు వచ్చింది. గత ఏడాది వీరిద్దరూ గొడవపడ్డారు. వ్యసనాలకు బానిసై 2016 ఏప్రిల్ 5న ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఆరోపిస్తూ శ్రీలక్ష్మి 2016 నవంబరు 2న సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ 498ఏ కింద కేసు పెట్టారు. అలాగే తన భర్త ఆదాయ పరిస్థితి బాగానే ఉన్నందున తన జీవనోపాధికి అతని నుంచి నెలకు 10 లక్షలు ఇప్పించాలని విజయవాడ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు నెలకు 8 లక్షలు భరణంగా చెల్లించాలని పృథ్వీరాజ్‌ను ఆదేశించింది. హైదరాబాద్ కి తిరిగి వచ్చిన వెంటనే పృథ్వీరాజ్ దీనిపై వివరణ ఇవ్వనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.