రాజమౌళి తండ్రి, ప్రఖ్యాత సినీ రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆయన ఆల్రెడీ పెద్ద స్టార్ రైటర్ అయినప్పటికీ ఈ ఇంటర్వ్యూలో ఎందుకో ఓ కొత్త ఆర్టిస్ట్ ఫేమస్ అవ్వడం కోసం చేసినట్లు కొన్ని సంచలన కామెంట్లు చేశారు.’ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో ఇద్దరి హీరోలకు మధ్య వచ్చే ఓ కీలక ఫైట్ గురించి లీక్ చేసి హాట్ టాపిక్ అయ్యారు. అటు తర్వాత రాజమౌళి, పవన్ కళ్యాణ్,మహేష్ బాబు వంటి వారి పై సెటైర్ లతో కూడుకున్న కామెంట్లు చేశారు.
ఇదిలా ఉండగా.. సంబంధం లేకపోయినా ఓ సందర్భంలో తాను కులాంతర వివాహం చేసుకున్నానని అది కూడా… తన భార్య కులం గురించి తెలియకుండానే వివాహం చేసుకున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఆయన మాటల్లో.. ‘నేను నా భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అయితే పెళ్లి చేసుకున్న టైములో నా భార్య కులం ఏంటో నాకు తెలీదు. కానీ కొంత కాలానికి ఆమె చిరంజీవి వీరాభిమాని అని తెలిపింది. అక్కడితో అయిపోలేదు, ప్రతీసారి ఆమె ‘మా చిరంజీవి మా చిరంజీవి’ అంటూ ఉండేది. ఒకసారి నేను ఎందుకు ప్రతీసారి “మా చిరంజీవి మా చిరంజీవి” అంటుంటావ్ అని అడిగాను.
అందుకామె ‘మేము కాపు కులానికి చెందిన వాళ్ళం’ తెలియజేసింది. చిరంజీవి వల్లే నా భార్య కులం ఏంటో తెలిసింది’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. మెగా ఫ్యామిలీ అభిమానులందరినీ ఆయన తన వైపుకి తిప్పుకోవాలని ఇలాంటి కామెంట్స్ చేశారా ఏంటి? అనే డిస్కషన్లు ఇప్పుడు రన్ అవుతున్నాయి. అయితే ‘రాజమౌళి తల్లి ‘బాహుబలి’ చూడక ముందే చనిపోయిందని, ఆమె మరణించడానికి ముందు ఆరు నెలల పాటు కోమాలో ఉందని’ విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!