పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ మధ్య ఈ నామస్మరణ బాగా ఎక్కువైపోయింది. అదే క్రమంలో పవన్ అటు సినిమాల్లోనే కాక, పొలిటికల్ గాను ఎదగాలి అని అనుకుంటున్న తరుణంలో పవన్ రేంజ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క పొలిటికల్ హీరోగా మారాలి అని పవన్ చేసే ప్రతీ ప్రయత్నం అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతుంది. విషయం లోకి వెళితే, పవన్ కల్యాణ్ తన కరియర్ ను చేతులారా పాడు చేసుకుంటున్నాడు. ఆయన సినిమాలకు ఆయన కధలు రాసుకోకుండా ఉంటే అదే సూపర్ హిట్ ఇస్తుంది, అని ఈ మధ్య ఒకానొక ఇంటెర్వ్యు లో బాహుబలి కధా రచయిత విజయేంద్ర ప్రసాద్ అన్నారు. అయితే అదే క్రమంలో రీసెంట్ గా బాహుబలి సినిమా ప్రమోషన్స్ లో పార్ట్ 2 ఇంటర్వల్ సీన్ ను పవర్ స్టార్ క్రేజ్ చూసి ఆ స్పూర్తితోనే రాశాను అని తెలిపాడు విజయేంద్ర ప్రసాద్.
మరి అలాంటి బలమైన కధా రచయిత పవన్ కల్యాణ్ వంటి హీరోకి కధ అందిస్తే, అదీ ఒక పవర్ఫూల్ స్టోరీ అయితే ఎలా ఉంటుంది? దుమ్ము రేగిపోతుంది. రికార్డుల శబ్ధం మారుమోగిపోతుంది కదా, ఇక దాన్ని విజయండ్ర ప్రసాద్ కుమారుడు మన రాజమౌళి దర్శకత్వం చేస్తే, ఇక నో మోర్ రికార్డ్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని అర్ధం అయిపోతుంది. విషయం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ స్టామినాను సరితూగే కథ ఎవరు ఇవ్వట్లేదని అన్నాడు. అంతేకాదు ఛాన్స్ దొరికితే తాను పవర్ స్టార్ రేంజ్ కు తగ్గట్టు కథ ఓకటి రెడీ చేస్తా అని చెబుతున్నాడు విజయేంద్ర ప్రసాద్. మరి 2018 ముగిసే లోగా వరుస సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్న పవన్ కు ఆలోగా విజయేంద్ర ప్రసాద్ కథ అందించగలడా లేడా అన్నది చూడాలి. ప్రస్తుతం పవర్ స్టార్ త్రివిక్రం కాంబినేషన్ లో మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో మూవీ ఉంటుందని తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే విజయంధ్ర ప్రసాద్ కు పవన్ కు మంచి కధ అందించాలి అన్న ఆలోచన ఉంది. మరి దీనిపై పవన్ కాస్త ఫోకస్ పెడితే బావుంటుంది ఎందుకంటే అసలే పవన్ డిజాస్టెర్స్ తో కాలం గడిపేస్తూ ఉన్నాడు కదా…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.