ఆ చిత్రానికి సీక్వెల్ సిద్దం చేస్తున్న బాహుబలి రచయిత..!

  • June 21, 2016 / 01:20 PM IST

శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ముధల్వాన్’ చిత్రం కోలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం హిందీ లో ‘నాయక్’ గా రీమేక్ కాగా.. ఈ చిత్రంలో అనిల్ కపూర్, రాణి ముఖర్జీలు ప్రధాన పాత్రల్లో నటించారు. పోలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రానుందని సమాచారం.

మగధీర, బాహుబలి, భజరంగి భైజాన్ చిత్రాలకు కథలను అందించిన కే‌వి విజయేంద్ర ప్రసాద్ ఈ సీక్వెల్ కు కథ అందిస్తున్నారు. ‘ ఈ చిత్రానికి సీక్వెల్ ఉంది. ఇప్పుడే కథ మొదలు పెట్టాను. త్వరలోనే ఇది పూర్తి అవుతుంది. ఈ చిత్రంలో ఎవరు నటిస్తారన్నది ఇంకా ఖరారు కాలేద’ని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సీక్వెల్ ను దీపక్ ముకుత్, ఏరోస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్మించే అవకాశం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus