విక్రమ్ కుమార్ వెర్రికి మందు దొరికేసిందోచ్!!

  • June 7, 2016 / 06:04 AM IST

“13బి, ఇష్క్, మనం, 24” ఇలా సినిమాకి సినిమాకి సంబంధం లేకుండా దేనికదే డిఫరెంట్ జోనర్ లో సినిమాలు తీస్తూ తక్కువ సినిమాలతోనే దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న దర్శకుడు విక్రమ్ కుమార్ కు కాస్తంత వెర్రి ఉందని, ఆ “వెర్రి” వల్లే ఇటువంటి మంచి సినిమాలు తీయగలడని “మనం” సినిమా సక్సెస్ మీట్ లో నాగార్జున పేర్కొన్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు విక్రమ్ కుమార్ “వెర్రి”కి మందు దొరికింది.

“మందు” అనుకొంటే అదేదో మేడిసేనో లేక, ట్రీట్ మెంటో అనుకొనేరు. ఈయనగారికి “పెళ్ళి” సెట్ అయ్యింది. మన పెద్దాళ్ళు “వెర్రి”కి మందు “పెళ్లి” అంటూంటారు కదా, అందుకే ఇప్పుడు విక్రమ్ కుమార్ “వెర్రి”కి మందు దొరికిందని చమత్కరించాం.

ఇంతకీ విషయం ఏంటంటే.. సౌండ్ ఇంజనీర్ గా ఏ.ఆర్.రెహమాన్ వద్ద పనిచేసే శ్రీనిధి అనే యువతిని ఇష్టపడిన విక్రమ్ కుమార్, పెద్దలను ఒప్పించి ఆమెను వివాహమాడడానికి ఒప్పించాడు. “24” సినిమా కోసం ఏ.ఆర్.రెహమాన్ దగ్గరకి వెళ్లినప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందంట. నిన్న ఓ ప్రెయివేట్ ప్లేస్ లో వీరిద్దరికీ నిశ్చితార్ధం కూడా జరిగిపోయింది. సెప్టెంబర్ నెలలో వీరి వివాహం జరగనుంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus