అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడు.టీజర్, ట్రైలర్ లు ప్రామిసింగ్ గా అనిపించాయి.సినిమా ఏ జోనర్ అనేది తెలియకుండా కన్ఫ్యూజ్ చేసి ఆసక్తిని రేకెత్తించాయి. దీంతో సినిమాపై అంచనాలు కూడా ఓ మాదిరిగా ఏర్పడ్డాయి. ఫిబ్రవరి 18న శివరాత్రి కానుకగా చాలా గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. పర్వాలేదు అనిపించే విధంగా టాక్ వచ్చింది.
దీంతో ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. ఒకసారి ఫస్ట్ 2 కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.23 cr |
సీడెడ్ | 0.45 cr |
ఉత్తరాంధ్ర | 0.21 cr |
ఈస్ట్ | 0.19 cr |
వెస్ట్ | 0.11 cr |
గుంటూరు | 0.11 cr |
కృష్ణా | 0.12 cr |
నెల్లూరు | 0.08 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 2.5 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.09 cr |
ఓవర్సీస్ | 0.12 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 2.71 cr (షేర్) |
‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రానికి రూ.4.21 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కొన్ని చోట్ల నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.2.71 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.1.79 కోట్లు షేర్ ను రాబట్టాలి.