సినీ రంగంలో రాణించాలనుకునే వారికి నటనలో నాణ్యమైన శిక్షణ అందిస్తూ ఎంతో మంది ప్రతిభావంతులను వెండితెరకు పరిచయం చేస్తున్నారు ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల(Vinodh Nuvvula). తాజాగా ఆయన ఓ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రతిష్టాత్మక ‘కోడి రామకృష్ణ అవార్డ్స్ 2026’ లలో ‘బెస్ట్ యాక్టింగ్ స్కూల్ ఇన్ హైదరాబాద్’ కి గాను ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ’ ఎంపికైంది.
ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, సీనియర్ నటుడు సుమన్, సీనియర్ నిర్మాత అంబికా కృష్ణ, వంటి వారు పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా వినోద్ నువ్వుల ఈ గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా వినోద్ నువ్వుల మాట్లాడుతూ… “తెలుగు చిత్రసీమలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ దర్శకులు కోడి రామకృష్ణ గారి పేరిట నెలకొల్పిన ఈ అవార్డులలో మా అకాడమీకి ‘బెస్ట్ యాక్టింగ్ స్కూల్ ఇన్ హైదరాబాద్’ పురస్కారం లభించడం పట్ల ఎంతో గర్వంగా, ఆనందంగా ఫీల్ అవుతున్నాను. గౌరవనీయులైన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గారు, నటులు సుమన్ గారు, అంబికా కృష్ణ గారు వంటి పెద్దల సమక్షంలో ఈ పురస్కారాన్ని అందుకోవడం నా జీవితంలో మరిచిపోలేని అనుభూతి.
మా అకాడమీని నమ్మి ఆదరిస్తున్న విద్యార్థులకు, ప్రోత్సహిస్తున్న శ్రేయోభిలాషులకు మరియు ఈ అవార్డుకు ఎంపిక చేసిన నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా మరింత మందికి శిక్షణ అందించి సినీ రంగానికి పరిచయం చేయడం మా సంస్థ లక్ష్యం” అంటూ చెప్పుకొచ్చారు.