ధనుష్ కథానాయకుడిగా నటించడంతోపాటు కథ అందించిన చిత్రం “విఐపి 2”. ఈ చిత్రానికి దర్శకురాలు ఆయన ఒదిన సౌందర్య రాజనీకాంత్ కావడం విశేషం. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో సీక్వెల్ పై భారీ అంచనాలు నమోదయ్యాయి. అయితే.. ట్రైలర్ విడుదల ముందువరకూ సినిమాపై విశేషమైన అంచనాలు ఉన్న “విఐపి 2″పై విడుదలైన ట్రైలర్ ఎఫెక్ట్ బాగా పడింది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ కీలకపాత్ర పోషించిన ఈ చిత్రం కథ సేమ్ ఫస్ట్ పార్ట్ ను తలపించడం, పెద్దగా ఆకట్టుకొనే అంశాలు కూడా లేకపోవడంతో అప్పటివరకూ ఉన్న క్రేజ్ కూడా కాస్త తగ్గింది. అందుకే జూలైలో విడుదల కావాల్సిన ఈ చిత్రం బిజినెస్ సరిగా అవ్వక ఆగస్ట్ రెండోవారానికి పోస్ట్ పోన్ అయ్యింది. మొదట్లో తమిళంతోపాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదల చేయాలనుకొన్నారు. అందుకోసం “మాది బైలింగువల్ సినిమా.. తెలుగు-తమిళంలో ఒకేసారి షూట్ చేశాం” అంటూ డబ్బా కొట్టుకొన్నారు.
కానీ.. ఇప్పుడేమో తమిళంలో ఈ శుక్రవారం విడుదలవుతుండగా.. వచ్చేవారం అనగా ఆగస్ట్ 18న తెలుగులో “విఐపి 2” విడుదలవుతోంది. తమిళంలో సినిమాకి వచ్చే టాక్ మరియు రిజల్ట్ ఎఫెక్ట్ తెలుగు రిలీజ్ పై పడుతుంది. ఇప్పటికే తెలుగులో 3 పెద్ద సినిమాలు పోటీపడుతుండడం ఇందుకు కారణాలైనప్పటికీ.. ఫైనల్ రిజల్ట్ ఏమవుతుందో వేచి చూడాల్సిందే!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.