విశాల్ మళ్లీ ‘మాస్’నే నమ్ముకున్నాడు!!!

తమిళ-తెలుగు కధానాయకుడు విశాల్…పందెంకోడి సినిమాతో చిత్ర పరిశ్రమని షేక్ చేశాడు. అయితే ఆ తరువాత వరుసగా సరికొత్త కధనాలతో, డిఫరెంట్ టైటిల్స్తో వరుసగా సినిమాలు చేశాడు. ఒకానొక దశలో తెలుగులో మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా, తమిళంలో టాప్ హీరోగా మారిపోయాడు. అయితే ఆ క్రేజ్ ని కంటిన్యూ చేసుకునే క్రమంలో చతికిల పడి, పాపం సంపాదించుకున్నంత పేరు, మార్కెట్ రెండూ పోగొట్టుకున్నాడు. ఇదిలా ఉంటే వరుస పరాజయాలతో కుంగిపోతున్న ఈ తమిళ హీరో మళ్లీ మాస్ నే నమ్ముకున్నాడు. మాస్ సినిమాతో మరో సారి పంజా దెబ్బ రుచి చూపించేందుకు రెడీ అయిపోయాడు. ఇంతకీ విషయం ఏమిటంటే…విశాల్ తాజాగా ‘రాయుడు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ విడుదల అవుతుంది.

నిన్ననే…ముగ్గురు టాప్ హీరోయిన్లు శ్రుతి హాసన్, తమన్నా, రకుల్ ప్రీత్‌ల చేతుల మీదుగా ‘రాయుడు’ టీజర్ విడుదలైంది. ఇక ఆ టీజర్ లో మన హీరోగారి లుక్ చూస్తే…మాస్…ఊరమాస్ ఆనాల్సిందే. మార్కెట్ లో రౌడీలాగా, డ్రాయర్ మీదికి లుంగీ ఎగ్గట్టి.. కలర్ బనియన్ వేసుకుని.. కత్తి నోట్లో పెట్టుకుని అచ్చమైన ఊర మాస్ అరవ హీరోలాగా కనిపించాడు విశాల్. అంతేకాకుండా ఈ సినిమాలో అతని క్యారెక్టర్ ని తెలియజేస్తూ ఉన్న డైలాగ్…కొట్టడం మూడు రకాలు.. మాట్లాడకముందు కొట్టడం.. మాట్లాడుతూ కొట్టడం.. మాట్లాడనిచ్చి కొట్టడం. ఈ రాయుడు మొదటి రకం’’ ఈ టీజర్ కు ప్లస్ అవడమే కాదు, సినిమాపైనే భారీ అంచనాలను పెంచింది. మరి ఈ నెల 20న వస్తున్న ఈ సినిమా విశాల్ కు ఎంతవరకూ కలసి వస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus