విశాల్ హీరోగా సుందర్.సి డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం ‘యాక్షన్’. నవంబర్ 15న ఈ చిత్రం విడుదలైంది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేశారు. మొదటి షో నుండీ ఈ చిత్రానికి డీసెంట్ టాక్ లభించింది. మొదటి వీకెండ్.. వసూళ్ళు కూడా బాగానే వచ్చాయి. కానీ తరువాత అదే దూకుడు కొనసాగించే విషయంలో మాత్రం విఫలమయ్యిందనే చెప్పాలి. వీక్ డేస్ లో మాత్రం ఈ చిత్రం కనీసం కలెక్షన్లను కూడా నమోదుచేయలేకపోయింది.
ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో 6.7 కోట్లకు విక్రయించారు. అయితే ఫుల్ రన్ ముగిసేసరికి 2.88 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అంటే కనీసం 50 శాతం కూడా ఈ చిత్రం వెనక్కి రాబట్టలేకపోయింది. విశాల్ చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ చిత్రాన్ని అంత పెట్టి కొన్నారు. ‘పందెం కోడి2’ లాంటి యావేరేజ్ సినిమా కూడా 7 కోట్ల షేర్ వరకూ కలెక్ట్ చేసింది. కానీ ఈ చిత్రానికి డీసెంట్ టాక్ వచ్చినప్పటికీ కల్లెక్షన్లని రాబట్టలేకపోయింది. నవంబర్ సీజన్లో విడుదలయ్యే సినిమాలకి కలెక్షన్లు అంత ఆశాజనకంగా ఉండవనే సెంటిమెంట్ ఎప్పటినుండో ఉంది. ‘యాక్షన్’ కూడా రాంగ్ టైమింగ్లో రావడం వల్లే ఇలా డిజాస్టర్ అయ్యిందని తెలుస్తుంది.