కోలీవుడ్ తో పాటు టాలీవుడ్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరోల్లో విశాల్ కూడా ఒకడు. ఇతని సినిమాలకు కూడా ఇక్కడ కూడ మార్కెట్ ఉంది. ఈ మధ్య కాలంలో ‘డిటెక్టివ్’ ‘అభిమన్యుడు’ ‘పందెం కోడి2’ వంటి చిత్రాలతో హిట్లు కొట్టి ఆ తరువాత ‘అయోగ్య’ ‘యాక్షన్’ వంటి చిత్రాలతో నిరాశపరిచాడు విశాల్. అయినప్పటికీ విశాల్ నటించిన తాజా చిత్రం ‘చక్ర’ కు మంచి బిజినేసే జరిగింది.ఎం.ఎస్.ఆనందన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న విడుదల కాబోతుంది. ‘జెర్సీ’ బ్యూటీ శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రెజీనా కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
ఇక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ ను ఓ సారి పరిశీలిస్తే :
నైజాం
1.75 cr
సీడెడ్
0.75 cr
ఉత్తరాంధ్ర
2.40 cr
ఏపీ+తెలంగాణ (టోటల్)
4.90 cr
‘చక్ర’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.9కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 5.4కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే పోటీగా మరో 3 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరో పక్క ‘ఉప్పెన’ ముప్పు కూడా ఉంది. అసలే ఫిబ్రవరి వంటి డ్రై సీజన్. ఇన్ని ప్రతికూల పరిస్థితుల నడుమ ఈ చిత్రం రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి..!