కాంట్రవర్సీ రాజేసిన ఎన్టీఆర్ బర్త్ డే విషెస్ పోస్ట్

యంగ్ హీరో విశ్వక్ సేన్ వద్దనుకున్నా ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కు కుంటూ ఉంటాడు. ఆయన కనీసం బెస్ట్ విషెస్ చెప్పినా, అది కాంట్రవర్సి అయ్యి కూర్చుంటుంది. ఇక ఈనెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన వేసిన ట్వీట్ వివాదస్పదంగా మారింది. ఎన్టీఆర్ కి అందరూ టాలీవుడ్ ప్రముఖుల వలే సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఒట్టి శుభాకాంక్షలే, కాకుండా తన గత చిత్రం ఫలక్ నుమా దాస్ మూవీలో ఓ సాంగ్ ని తీసుకొని, మాస్ కా దాస్, మాస్ కా బాప్ అంటూ ప్రత్యేకంగా ఎన్టీఆర్ కి విషెస్ చెప్పారు.

కాగా ఎన్టీఆర్ కి విషెస్ చెప్పడానికి విశ్వక్ వాడుకున్న పాట వివాదస్పదం అయ్యింది. తన అనుమతి లేకుండా ఈ పాటను వాడుకున్నాడంటూ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. ఈ పాటను వెంటనే తొలగించాలంటూ వివేక్ యూట్యూబ్‌లో ఈ సాంగ్ లింక్ కింద కామెంట్ కూడా పెట్టాడు. అయినా విశ్వక్ సేన్ అది నా చిత్రం కోసం రూపొందించిన సాంగ్, ఆ సినిమా నిర్మాతను నేనే కనుక ఆ పాటపై సర్వ హక్కులు నావే అని విశ్వక్ అంటున్నారు.

దీనితో ఈ సంగీత దర్శకుడు విశ్వక్ సేన్‌పై లీగల్ యాక్షన్ తీసుకోడానికి సిద్ధమయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై విశ్వక్‌కు నోటీసులు కూడా వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ సాంగ్ వివాదం ఇప్పుడు చిలికి చిలికి గాలివాన అయ్యేలా ఉంది.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus