‘బిగ్ బాస్3’ లో వరుణ్ సందేశ్, వితిక దంపతుల సందడిని అంత ఈజీగా ఎవ్వరూ మరిచిపోలేరు. ఓ పక్క కంటెస్టెంట్లుగా గేమ్ ఆడుతూనే మరోపక్క భార్య భర్తలుగా అన్యోన్యంగా ఉంటూ.. అప్పుడప్పుడూ చిన్న చిన్న గొడవలు పడుతూ.. మళ్ళీ కాసేపటికి కలిసిపోయి ఒకరినొకరు బుజ్జగించుకుంటూ.. సారీలు చెప్పుకుంటూ ఆదర్శంగా నిలిచి.. బోలెడంత మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. వితిక ఎలా ఉన్నా కానీ.. వరుణ్ సందేశ్ మాత్రం కచ్చితంగా ‘బిగ్ బాస్3’ విన్నర్ గా నిలవాలని చాలా మంది కోరుకున్నారు.
అది జరగకపోవడంతో నిరాశకు గురయ్యారు కూడా.! ఇక వితిక.. హౌస్ నుండీ బయటకు వచ్చాక ఓ యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.గతంలో అయితే ఈమె ”భీమిలి కబడ్డీ జట్టు’ వంటి పలు సినిమాల్లో కూడా నటించింది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. తాజాగా వితిక షేరు ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆమె చెల్లి వివాహ వేడుక ఘనంగా కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో జరిగింది.
ఈ వేడుకకి బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా హాజరై సందడి చెయ్యడం విశేషం.ముఖ్యంగా వితిక ఫ్రెండ్ మరియు ‘బిగ్ బాస్3’ కంటెస్టెంట్ అయిన పునర్నవి భూపాలం హాజరయ్యి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అని చెప్పొచ్చు. ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :