Viva Harsha: వైవా హర్ష ప్రేమ పెళ్లిలో ఇన్ని ట్విస్టులా?

  • October 23, 2021 / 11:25 AM IST

ఈ మధ్య కాలంలో సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖ సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు. టాలీవుడ్ ప్రముఖ కమెడియన్లలో ఒకరైన వైవా హర్ష వివాహం అక్షర అనే యువతితో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. వైవా హర్ష అక్షరల వివాహం ప్రేమ వివాహం కావడం గమనార్హం. హర్ష విశాఖపట్నానికి చెందిన వ్యక్తి కాగా వైవా అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా అతను పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఆ షార్ట్ ఫిలిమ్ వల్ల పేరు, పాపులారిటీ రావడంతో అతని పేరు వైవా హర్షగా మారింది.

ఆ తర్వాత సినిమా ఆఫర్లు కూడా రావడంతో ఆ ఆఫర్ల ద్వారా వైవా హర్ష క్రేజ్ ను పెంచుకున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఒకటైన ఆహా ఓటీటీ కొరకు హర్ష కొన్ని షోలు కూడా చేసి ఆ షోల ద్వారా పాపులారిటీని మరింత పెంచుకున్నారు. వైవా హర్ష అక్షరల వివాహ వేడుక వారం రోజుల పాటు ఘనంగా జరిగింది. సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు.

తాను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పగా అక్షర తనను చేసుకుంటావా? అని అడిగిందని తాను వెంటనే ఒప్పుకున్నానని హర్ష చెప్పుకొచ్చారు. అయితే అక్షర నాన్న మాత్రం ఒప్పుకోవడానికి సమయం పట్టిందని హర్ష వెల్లడించారు. హర్ష ఒక ఇంటివాడు కావడంతో అతని అభిమానులు సంతోషిస్తున్నారు. కలర్ ఫోటో, గల్లీ రౌడీ సినిమాలతో వైవా హర్ష ఖాతాలో రెండు విజయాలు చేరగా హర్ష కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus