Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » VN Aditya: సమ్మె పేరుతో కార్మికులకు పని లేకుండా చేయకూడదు

VN Aditya: సమ్మె పేరుతో కార్మికులకు పని లేకుండా చేయకూడదు

  • August 18, 2025 / 01:58 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

VN Aditya: సమ్మె పేరుతో కార్మికులకు పని లేకుండా చేయకూడదు

గత 2 వారాల నుండి టాలీవుడ్లో జరుగుతున్న సమ్మె గురించి అందరికీ తెలిసిందే. తెలుగు సినీ ఫెడరేషన్ వర్కర్స్ తమ వేతనాలు 30 శాతానికి పెంచాలంటూ సమ్మె బాట పట్టారు. అలా చేస్తే తప్ప షూటింగ్స్ కు హాజరుకాము అని తెగేసి చెప్పేశారు. దీనిపై పలువురు నిర్మాతలు ‘అది న్యాయపరమైనది కాదు,పనిచేసేవాళ్ళని సైతం యూనియన్ లీడర్స్ చెడగొడుతున్నారు, అసలే సినిమాలు సరిగ్గా ఆడక నిర్మాతలు ఇబ్బంది పడుతుంటే.. వేతనాలు అంత భారీగా ఎలా పెంచుతామని’ ప్రశ్నిస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం.

VN Aditya

దీంతో ఫెడరేషన్ కార్మికులు నిర్మాతలపై మండిపడుతూ ‘హీరోయిన్లకి ఫ్లైట్ ఖర్చులు, టీం ఖర్చులు పెట్టుకోవడానికి లేని ఇబ్బంది మాకు ఇచ్చే డబ్బుల వద్ద మాత్రం వచ్చేస్తుందా?’ అంటూ చేస్తున్న విమర్శలు కూడా అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సీనియర్ దర్శకులు వి.ఎన్.ఆదిత్య సమ్మె తీరుని వ్యతిరేకిస్తూ తన శైలిలో స్పందించారు.

తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వి.ఎన్.ఆదిత్య ఈ విషయంపై స్పందిస్తూ.. “ఒక్క వ్యక్తి సినిమాల్లోకి వచ్చి, డబ్బులొస్తేనే తీస్తాను, రాకపోతే వేరే వ్యాపారం లో పెడతాను అనుకోకుండా, లాభమొచ్చినా సినిమాలే తీస్తూ, నష్టమొచ్చినా సినిమాలే తీస్తూ తన బయటి వ్యాపారాలలో వచ్చిన లాభాలు కూడా సినిమా రంగం మీదకే మళ్లిస్తూ ఈ రంగం లో పదేళ్ల లో దాదాపు వెయ్యికోట్ల పైగా పెట్టుబడి పెట్టుకుని, ఫ్లాపుల్ని, ట్రోలింగులని ఎదురీదుతూ మొండిగా తట్టుకుని నిలబడితే.. ఆయన్ని ఎంకరేజ్ చేసి మరిన్ని మంచి సినిమాలు చేసేలా ప్రోత్సహించాల్సింది పోయి, అబద్ధపు ప్రచారాలతో, స్వార్ధపూరిత రాజకీయాలతో, కుల వివక్షలతో ఈ రంగం మీద పెట్టుబడిని బయటి రంగాలకి మళ్లించేలా మన ప్రవర్తన ఉంటే ఎవడికిరా నష్టం..యాభై సినిమాలకు రెండొందల మందికి పైగా పదేళ్ల లో ఆయన పెట్టిన మూడు పూటల భోజనం ఖర్చు మాత్రమే ఒక పది పెద్ద సినిమాల బడ్జెట్టు..కారు డ్రైవర్లకి, ప్రొడక్షన్ బాయ్స్ కి డబ్బులెగ్గొట్టి, హీరో, హీరోయన్స్ కి మాత్రమే డబ్బులిచ్చి, బడా ప్రొడ్యూసర్స్ లా మార్కెట్ లో పోజు కొట్టే చాలామందిని ఒక్క మాట అనలేని యూనియన్ లీడర్లు ఈయన మీద మాత్రం విరుచుకు పడిపోతారు..ఏ కార్మిక సంఘం అయినా వర్కర్ కి అన్యాయం చేసిన ప్రొడ్యూసర్ పై పడాలి..వేలమంది వర్కర్స్ కి పని కల్పించే ప్రొడ్యూసర్స్ మీద కాదు.. ఈ సమ్మె వల్ల కడుపులు కాలుతున్న కార్మికులు లక్షల్లో ఉన్నారు తెలుగు ఇండస్ట్రీ లో.. వాళ్ల ఆకలి బాధలకు ఏ యూనియన్ నాయకుడు సమాధానం చెప్తాడు..కళారంగంలో పని దొరకడమే మొదటి ప్రాధాన్యత..దానిని ఆపే సంఘాలు ఉన్నా ఒకటే..ఊడినా ఒకటే.. చేతనైతే యూనియన్లు అన్నీ కలిసి ఒక్క రోజు షూటింగ్ జరిగేందుకు దోహదపడాలి.. ఆపడానిక్కాదు..ఎన్నుకున్న నాయకులు షూటింగులకు అంతరాయం కలగకుండా సమస్యలకు పరిష్కారం తేవాలి అది సామర్ధ్యం అంటే..పనుంటే గాని డబ్బు, అన్నం దొరకని పరిశ్రమలో పని ఆపి, ఎవ్వరూ ఎవ్వరినీ ఉద్ధరించలేరు..నేను ఏ యూనియన్ లో అయినా సాధారణ సభ్యుడినే గానీ, ఏ పదవిలోనూ ప్రస్తుతం లేను..అయినా నాకేం తెలుసని ఈ పోస్ట్ పెట్టానని ఎవరైనా అనుకుంటే.. ముప్ఫై అయిదేళ్లుగా సినిమా రంగంలో వస్తున్న ప్రతి మార్పు కి ప్రత్యక్ష సాక్షి ని నేను.. నా అనుభవాన్ని మించిన అర్హత లేదు అని కచ్చితంగా చెప్పగలను..రెండు శాతం సక్సెస్ రేటున్న రంగానికి ఇన్వెస్ట్ మెంట్లు తెప్పించడం చాలా కష్టం..రెండు వేల ఎనిమిది నుండి నా ద్వారా వచ్చిన పెట్టుబడులు రెండు వేల కోట్లు..రాబోయే పెట్టుబడులు మరో వేయి కోట్ల పైనే..
నా వల్ల వచ్చిన గౌరవం ముప్ఫై రెండు జాతీయ,అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు..ఇంతకన్నా అర్హత కావాలా మాట్లాడడానికి..?నిర్మాతల్ని సినిమాలు తీయనివ్వండి.. కార్మికులు బావుంటారు.. షూటింగులు ఆపకండి. అడుక్కు తినాల్సి వస్తుంది..సినిమా అనేది పని చేసేవాడికి మాత్రమే పరమాన్నం పెడుతుంది.. పని లేని రోజున పస్తులు పడుకో పెడుతుంది..ఇది తెలుసుకుని మసలుకోండి..! అలాగే సమ్మె చేస్తే గాని సమస్య పరిష్కారం కాలేదంటే ముందు ఆ సంఘం నాయకుణ్ని మార్చెయ్యాలి..చర్చలతో సమస్య లకి పరిష్కారం తేలేని నాయకుడు ఏ సంఘానికైనా అప్రయోజకుడే..దాసరి గారైనా, చిరంజీవి గారైనా, తమ్మారెడ్డి భరద్వాజ గారైనా, మోహన్ బాబు గారైనా, బాలకృష్ణ గారైనా, ఇటువంటి సమస్య వస్తే,సమ్మె పరిష్కారం కాదని, చర్చలతోనే పరిష్కరించుకుందాం అని ముందే చెప్తారు..
పరిష్కారం తెస్తారు..ఈ లోగా వచ్చే భత్యాన్ని ఆపద్దని చెప్తారు..ఎవరైనా ఇదే చెప్తారు.. చెప్పాలి కూడా..అదీ కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించడం అంటే.. సమ్మె పేరుతో వాళ్లని షూటింగులకు దూరం చేసి, రోడ్డు మీద పడేయడం కాదు లీడర్ షిప్ అంటే..” అంటూ చెప్పుకొచ్చారు.

సూర్యని మ్యాచ్ చేయలేకపోయిన ఆమిర్.. ఎక్కడ తేడా కొట్టింది?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #movie producers
  • #Telugu Cinema
  • #telugu federation union strike
  • #Tollywood
  • #Vn Aditya

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

2 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

2 days ago
The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

2 days ago
Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version