Vv Vinayak: చిరుతో ‘విశ్వాసం’ రీమేక్.. క్లారిటీ ఇచ్చిన వినాయక్..!

  • January 21, 2023 / 07:28 AM IST

ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ తో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు చిరు. ‘ఖైదీ నెంబర్ 150’ వంటి బ్లాక్ బస్టర్ మూవీతో కంబ్యాక్ ఇచ్చిన చిరు.. ఈ 6 ఏళ్ళలో మరో హిట్ అందుకోలేదు. ‘సైరా నరసింహరెడ్డి’ సోసోగా ఆడగా… ‘ఆచార్య’ ‘గాడ్ ఫాదర్’ చిత్రాలు నిరాశపరిచాయి. ఎట్టకేలకు ‘వాల్తేరు వీరయ్య’ తో మంచి బ్లాక్ బస్టర్ అందుకుని ఫామ్లోకి వచ్చారు చిరు. ఇదే ఊపులో ‘భోళా శంకర్’ తో కూడా హిట్టు కొట్టాలని ఆయన భావిస్తున్నారు. అదే ఉత్సాహంతో షూటింగ్లో జాయిన్ అయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇది తమిళంలో అజిత్ హీరోగా రూపొందిన ‘వేదాళం’ కి రీమేక్ అన్న సంగతి అందరికీ తెలిసిన సంగతే..! ‘ఆవేశం’ పేరుతో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ ఆ టైంలో పవన్ కళ్యాణ్ తో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని ఓ బడా నిర్మాత… రిలీజ్ ను ఆపేసి రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు. కానీ పవన్ పొలిటికల్ రీజన్స్ తో బిజీగా ఉండటం వల్ల ఆ రీమేక్ డిలే అయ్యింది. మొత్తానికి మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు ఆ రీమేక్ ను రూపొందిస్తున్నారు.

‘భోళా శంకర్’ తర్వాత చిరు మరో చిత్రానికి కమిట్ అవ్వలేదు. వెంకీ కుడుములతో అనుకున్న మూవీ హోల్డ్ లో పడింది. ఈ నేపథ్యంలో చిరు ఓ తమిళ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ మొదలైంది. వివరాల్లోకి వెళితే.. 2019 లో అజిత్ హీరోగా రూపొందిన ‘విశ్వాసం’ మూవీని చిరు రీమేక్ చేయాలని ఆశపడుతున్నారట.

తన ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేసి ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని చిరు భావిస్తున్నట్టు వార్తలు మొదలయ్యాయి. ఈ టాపిక్ కూడా పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది. అయితే దర్శకుడు వినాయక్.. ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు. ‘అది వట్టి గాసిప్ మాత్రమే’ అని తేల్చి చెప్పేశారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus