అఖిల్ దెబ్బకు ఆస్తులు అమ్ముకుంటున్న వినాయక్?
- February 19, 2016 / 10:13 AM ISTByFilmy Focus
ఈ మధ్య ఇండస్ట్రీ లో బాగా సీక్రెట్ గా గుసగుసలు జరుతున్న విషయం ఏదైనా ఉంది అంటే అది ఒకప్పుడు అగ్ర దర్శకుడిగా ఒక వెలుగు వెలిగిన డైరెక్టర్ వి.వి.వినాయక్ అప్పుల బాధలతో తన ఆస్తులు అమ్ముకుంట్టున్నాడని ఒక వార్త ఇప్పుడు ఇండస్ట్రీ లో పాదరసం లా పాకిపోతుంది. అగ్ర హీరోలందరికీ సూపర్ హిట్స్ ఇచ్చిన మనోడు అఖిల్ దెబ్బకు ఫాం కోల్పోయి డిస్ట్రిబ్యూటర్స్ ను ఆడుకోవాల్సిన పనిలో ఉన్నాడని వినికిడి. కొన్ని రోజుల క్రితం వినాయక్ తను ఎంతో కష్టపడి కట్టుకున ఇల్లుని అమ్మేసాడని, తన సొంత ఊరిలో ఉన్న ధియేటర్ ను కూడా అమ్మకానికి పెట్టాడని వినికిడి.
తాజా గా అఖిల్ చిత్రం మొదట్లో జూబ్లి హిల్స్ లో ఒక ఇల్లు కట్టడాని వాస్తు సరిగా లేకపోవడం వాళ్ళ దానిని అమ్మేసాడని, ధియేటర్ అమ్మటం వెనుక దానిని అమ్మి వైజాక్ లో కొత్త ధియేటర్ కట్టాలనే ఆలోచనలో ఉన్నాడని అనుకుంటున్నారు.కాని దాని వెనుక అఖిల్ సినిమా దెబ్బ ఉందని ఇండస్ట్రీ లో కొందరు గుసగుసలాడుతున్నారు.ఏది ఏమైనా వినాయక్ కి మంచి గడ్డు కాలం నడుస్తుందనే చెప్పాలి.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












