Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ వసూళ్ల సునామీ.. సంబరాలు ఎప్పుడో?

  • January 24, 2023 / 05:24 PM IST

సంక్రాంతి మాస్‌ హీరో సినిమా పడితే.. కోట్లాభిషేకం జరగడం పక్కా అంటారు. అందులోనూ స్టార్‌ హీరోల సినిమా పడితే ఇంకానూ. అయితే ఆ సినిమాకు సరైన టాక్‌ రావాలి అనుకోండి. అలా మంచి టాక్‌ తెచ్చుకుని.. ఇప్పుడు 200 కోట్లకు పడగలెత్తాడు మెగాస్టార్‌ చిరంజీవి. ‘వాల్తేరు వీరయ్య’గా ఇటీవల సంక్రాంతికి వచ్చిన చిరంజీవి మొత్తంగా 10 రోజులకుగాను రూ. 200 కోట్లు వసూలు చేశాడని చిత్రబృందం ప్రకటించింది. చిరంజీవి ప్రధాన పాత్రలో బాబీ కొల్లి రూపొందించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’.

శ్రుతి హాసన్‌, రవితేజ, కేథరిన్‌ తదితరులు ఇతర కీలక పాత్రధారులు. విడుదలైన తొలి రోజుల్లో కాస్త నెగిటివ్‌ టాక్‌ వినిపించినా.. మాస్‌ పూనకాలు ముందు ఆ టాక్‌ నిలబడలేదు. దీంతో రోజుకు రోజుకు వసూళ్లు పెరిగి రూ. 200 కోట్లకు చేరాయి. తొలి నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్లు సంపాదించిన ఆ సినిమా ఇప్పుడు డబుల్‌ చేసేసుకుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ టికెట్‌ ధరలు వచ్చేయడంతో ఈ వసూళ్ల జోరు ఇంకొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది అంటున్నారు.

25న బాలీవుడ్‌ ‘పఠాన్‌’ రిలీజ్‌ కాబోతోంది. ఆ సినిమా ఫలితం కూడా ఈ సినిమా వసూళ్ల మీద ఎఫెక్ట్‌ చూపించే అవకాశం ఉంది. ఆ సినిమా కాస్త తేడా కొట్టినా.. మళ్లీ ‘వీరయ్య’ పూనకాలు మొదలవుతాయి అని పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు. ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో రూ. 95 కోట్లు సాధించగా, అలానే దేశంలోని ఇతర ప్రాంతాలు, ఓవర్సీస్‌ల్లో రూ. 115 కోట్లకుపైగా వసూలు చేసిందంటున్నారు.

అలా మొత్తంగా రూ. 200 కోట్లు వచ్చాయి అని ఓ లెక్క వినిపిస్తుంది. అయితే ఈ వివరాలు ఏవీ చిత్రబృందం చెప్పలేదు. అయితే మరి ఇంత వసూలు చేశాక సక్సెస్‌ పార్టీ పెట్టాల్సిందే. అయితే అది ఎప్పుడు అనేదే తెలియడం లేదు. మరోవైపు వీర సింహుడు ఇటీవల విజయోత్సవం నిర్వహించేసిన విషయం తెలిసిందే.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus