Waltair Veerayya Collections: సంక్రాంతి విన్నర్ అలాగే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘వాల్తేరు వీరయ్య’

  • March 4, 2023 / 11:42 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శృతి హాసన్, కేథరిన్ లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ కూడా విక్రమ్ సాగర్ అనే కీలక పాత్ర పోషించాడు. దీంతో ఈ మూవీ పై మొదటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి . ఇక మొదటి రోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో అదిరిపోయే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. సంక్రాంతి సీజన్ ను ఈ మూవీ కంప్లీట్ గా క్యాష్ చేసుకుంది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 35.70 cr
సీడెడ్ 18.06 cr
ఉత్తరాంధ్ర 17.08 cr
ఈస్ట్ 11.78 cr
వెస్ట్ 6.56 cr
గుంటూరు 7.89 cr
కృష్ణా 7.71 cr
నెల్లూరు 4.19 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 108.97 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 8.07 cr
ఓవర్సీస్ 13.25 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 130.29 cr (షేర్)

‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి రూ.86.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.87 కోట్ల షేర్ ను రాబట్టాలి. 6 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి రూ.130.29 కోట్లు షేర్ ను రాబట్టి… బయ్యర్స్ కు రూ.43.29 కోట్ల లాభాలను అందించింది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus