Chiranjeevi: చాలా కాలం తర్వాత చిరు చెలరేగిపోయాడంట!

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నారు.. ‘ఖైదీ నెం:150’ తో స్టార్ట్ చేసి తర్వాత ‘సైరా’ చేశారు. పాండమిక్ వల్ల ఆలస్యం అయ్యింది కానీ లేకపోతే మూవీస్ కౌంట్ పెరిగేదే. ఈ ఏడాది ఇప్పటకే ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ దింపారు. ఆయన సినిమాల లైనప్ చూసి ఇండస్ట్రీ వర్గాల వారు, ఫ్యాన్స్, ఆడియన్స్ తో పాటు సీనియర్ యండ్ యంగ్ హీరోస్ కూడా షాక్ అవుతున్నారు.

ఇప్పటికే బాబీ డైరెక్షన్లో ‘వాల్తేరు వీరయ్య’, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్ ‘భోళాశంకర్’ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఫ్రీ టైంలో కొత్త కథలు కూడా వింటున్నారు. యంగ్ డైరెక్టర్స్ మారుతి, ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుములతో సినిమాలున్నాయన్నారు కానీ అవింకా మెటీరియలైజ్ కాలేదు. త్రివిక్రమ్, బోయపాటి పేర్లు వినిపించాయి.. పూరి కూడా క్యూలో ఉన్నాడు. టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ మూవీని ప్రెస్టీజియస్ గా నిర్మిస్తోంది. మాస్ మహారాజా రవితేజ 20 ఏళ్ల తర్వాత చిరుతో నటిస్తున్నాడు.

ఇంతకుముందు ‘అన్నయ్య’ సినిమాలో చిరు పెద్ద తమ్ముడిగా నటించాడు. ఇటీవలే ఆయన షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. శృతి హాసన్ ఫస్ట్ టైం చిరు సరసన నటిస్తోంది.. చిరు కెరీర్ లో 154వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. అవేంటంటే.. చాలా కాలం తర్వాత చిరు పక్కా ఎంటర్ టైనర్ చేస్తున్నారట. ‘వాల్తేరు వీరయ్య’ గా ఆయన క్యారెక్టరైజేషన్, కామెడీ టైమింగ్, ఫన్ వంటివి అదిరిపోతాయట. చిరు కామెడీ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.

అందులోనూ తన నుండి ప్రేక్షకాభిమానులు కోరుకునే వినోదం పంచే క్యారెక్టర్ కావడంతో చిరు చెలరేగిపోయారట. ఈ న్యూస్ మెగా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తుంది. ఈమధ్యే డబ్బింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్పీడ్ గానే జరుగుతున్నాయి. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 11న వరల్డ్ వైడ్ రికార్డ్ రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ దీపావళి నుండి అప్ డేట్స్ స్టార్ట్ చేసి రాబోయే రెండు నెలలపాటు ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం..

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus