War 2: వార్ 2 తెలుగు రైట్స్.. రేటు మళ్ళీ పెరిగిందా?

స్పై థ్రిల్లర్ ‘వార్ 2’ (War 2) సినిమా ఇంకా ఫస్ట్ లుక్ హడావుడి స్టార్ట్ కాక ముందే టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్  (Jr NTR) జోడీగా నటిస్తున్న ఈ సినిమా, ‘వార్’ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందుతోంది. ఈ చిత్రంతో ఎన్టీఆర్ బాలీవుడ్‌లో అడుగుపెడుతుండగా, హృతిక్ రోషన్  (Hrithik Roshan) టాలీవుడ్ మార్కెట్‌లో భారీ విజయం సాధించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఇంకా టీజర్, ట్రైలర్ విడుదల కాకముందే పాన్ ఇండియా స్థాయిలో అంచనాలను రీచ్ చేసింది.

War 2

‘వార్ 2’లో హృతిక్ రోషన్ రా ఏజెంట్‌గా, ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరి కాంబినేషన్, ఆయాన్ ముఖర్జీ మేకింగ్‌తో సినిమా కొత్త అనుభూతిని ఇస్తుందని అభిమానులు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. సినిమా రిలీజ్‌కు ముందే టాలీవుడ్‌లో భారీ బిజినెస్ జరుగుతోంది. ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం పలు పెద్ద నిర్మాణ సంస్థలు పోటీపడగా, నాగవంశీ (Suryadevara Naga Vamsi ) -సునీల్ నారంగ్ ఈ రేసులో ముందున్నారని తెలుస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్‌తో వారు రూ.120 కోట్లకు డీల్ క్లోజ్ చేసే దిశగా ఉన్నట్లు సమాచారం.

మొదట 100 కోట్లు అనుకున్నప్పటికి ఇప్పుడు మళ్లీ రేటు పెంచినట్లు తెలుస్తోంది.ఈ భారీ బిజినెస్‌కు కారణం ఎన్టీఆర్ మార్కెట్ విలువ. ‘RRR’తో (RRR) పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగిన ఎన్టీఆర్, ‘దేవర’తో (Devara)  మరో భారీ విజయాన్ని అందుకున్నాడు. రీజనల్ మార్కెట్‌లో అతని ఫాలోయింగ్ అనూహ్యంగా పెరిగింది, ఇది ‘వార్ 2’ బిజినెస్‌కు పెద్ద ప్లస్ అవుతోంది. ఎన్టీఆర్ ఉన్న కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ ఖాయమని నిర్మాతలు భావిస్తున్నారు.

సినిమా డబ్బింగ్ చిత్రం కావడంతో మొదటి వారం టికెట్ ధరలు పెంచే అవకాశం లేనప్పటికీ, హిట్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ సాధించడం పెద్ద కష్టం కాదని అంటున్నారు. ‘వార్ 2’ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 14న, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందే టాలీవుడ్‌లో ఇంత భారీ బిజినెస్ జరగడం, సినిమాపై ఉన్న హైప్‌ను సూచిస్తోంది. హృతిక్, ఎన్టీఆర్ మధ్య యాక్షన్ సీన్స్, స్పై థ్రిల్లర్ ఎలిమెంట్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయని అభిమానులు ఆశిస్తున్నారు.

స్టార్ హీరో అభిమానిగా రామ్… ఫైనల్ గా దానికే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus