Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

టాలీవుడ్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంలో దర్శకుడు రాజమౌళి పాత్ర కీలకం. ‘బాహుబలి’ సిరీస్, ‘RRR’ లాంటి సినిమాలతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన రాజమౌళి (Rajamouli), ఇప్పుడు మహేష్ బాబుతో ‘SSMB29’ అనే గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాతో సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో రాజమౌళి మరోసారి అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా ఖ్యాతిని చాటేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

Rajamouli

లండన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ అల్బర్ట్ హాల్ వేదికగా ‘RRR’ సినిమా సంగీత కచేరి జరగనుంది. ఇంతకుముందు 2019లో ‘బాహుబలి 2’ సంగీత కచేరీతో ఈ వేదికపై రాజమౌళి సంచలనం సృష్టించాడు, ఇప్పుడు ‘RRR’తో మరోసారి అదే ఘనతను సాధించనున్నాడు. ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ‘RRR’ పాటలు, ముఖ్యంగా ఆస్కార్ విన్నింగ్ సాంగ్‘నాటు నాటు’, ఈ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రాయల్ ఫిల్‌హార్మోనిక్ కాన్సర్ట్ ఆర్కెస్ట్రా, బెన్ పోప్ నేతృత్వంలో ఈ సంగీత ప్రదర్శన జరగనుంది.

ఈ కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చేలా మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హాజరవుతున్నారు. ‘RRR’ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు, రాజమౌళితో ‘SSMB29’ కోసం పనిచేస్తున్న మహేష్ బాబు ఈ వేదికపై కనిపించనున్నాడు. మహేష్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడం ఈ ఈవెంట్‌కు మరింత ఆసక్తిని తెచ్చింది. ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులకు అరుదైన క్షణం కానుంది.

రామ్ చరణ్ ఇప్పటికే లండన్‌లో ఉన్నాడు, మేడమ్ టుస్సాడ్స్‌లో తన మైనపు విగ్రహం ఆవిష్కరణ కోసం వెళ్లిన అతను, ఈ కన్సర్ట్ పాల్గొననున్నాడు. ఎన్టీఆర్ కూడా ఈ ఈవెంట్‌లో భాగమవడానికి సిద్ధమయ్యాడు. మహేష్ బాబు లేటెస్ట్ లుక్, ‘SSMB29’ కోసం లాంగ్ హెయిర్ స్టైల్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో, అతను ఈ వేదికపై కనిపించడం అభిమానులకు పండగలా ఉండనుంది.

పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus