Ajith, Vijay: థియేటర్ యాజమాన్యం ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

స్టార్లకి అభిమానులు, వీరాభిమానులు, డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్లకి అసోసియేషన్స్ ఉంటాయ్. సినిమా రిలీజ్ అప్పుడు, తమ ఫేవరెట్ యాక్టర్ బర్త్‌డే నాడు సేవా కార్యక్రమాలు చేయడం లాంటివి సాధారణంగా చేస్తుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉంటుంది కానీ అభిమానం హద్దులు దాటితేనే ఇబ్బంది. ఈ విషయంలో తమిళ నాడు వాళ్లతో పోలిస్తే మన తెలుగు హీరోల ఫ్యాన్స్ చాలా బెటర్.. కోలీవుడ్‌లో దళపతి విజయ్, తల అజిత్ ఇద్దరూ టాప్ స్టార్స్.

ఇద్దరికీ సమానంగా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉంది. ఇక ఈ హీరోల అభిమానుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. సినిమాల రిలీజ్ అప్పుడు వాళ్లు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ప్రతిరోజూ సోషల్ మీడియాలో వీళ్ల మధ్య దారణమైన మాటల యుద్ధాలు జరుగుతుంటాయి. ఇప్పుడు జనవరి 11న అజిత్, విజయ్ సినిమాలు రిలీజ్ కానుండడంతో మరోసారి విబేధాలు తలెత్తాయి.. అజిత్ ‘తునివు’ (తెగింపు), విజయ్ ‘వరిసు’ (వారసుడు) సంక్రాంతి కానుకగా జనవరి 11న బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి.

దాదాపు 9 సంవత్సరాల తర్వాత ఈ స్టార్ల చిత్రాలు తలపడుతున్నాయి. ఇక తమిళనాట థియేటర్లు సర్దుబాటు చెయ్యలేక నానా అవస్థలు పడి ఎట్టకేలకు రూట్ క్లియర్ చేశారు. దాదాపు మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా ఈ రెండు సినిమాలతోనే నిండిపోయాయి. ఇప్పటికే థియేటర్లన్నీ ఫ్యాన్స్ ఫ్లెక్సీలతో, పూల దండలతో నిండిపోయాయి. అయితే ఓ మల్టీప్లెక్సులో స్క్రీన్స్ కేటాయించే విషయంలో అజిత్ – విజయ్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది.

మొత్తం మూడు స్క్రీన్స్ ఉన్న ఆ మల్టీప్లెక్సులో మొదటిది అజిత్ ‘తునివు’ కి, రెండవది విజయ్ ‘వరిసు’ కి కేటాయించారు. మూడో స్క్రీన్ ఏ హీరో సినిమాకివ్వాలి? అనే విషయంలో వివాదం తలెత్తింది.. మా హీరోకంటే మా హీరోకివ్వాలని రచ్చ చేశారు ఫ్యాన్స్. దీంతో థియేటర్ యాజమాన్యం రంగంలోకి దిగింది. టాస్ వేసి స్క్రీన్ సెలెక్ట్ చేసింది. అజిత్ ఫ్యాన్స్ టాస్ గెలవడంతో ‘తునివు’ కే మూడో థియేటర్ కూడా ఇచ్చేశారు. ఈ వీడియో చూసి, ఇలా కూడా స్క్రీన్ కేటాయిస్తారా! అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus